AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి విందులో పదేపదే రసగుల్లాలు తింటున్నాడనీ.. మండే తందూర్‌ పొయ్యిలో బాలుడిని విసిరేశాడు!

ఓ బాలుడు పలుమార్లు రసగుల్లాలు తీసుకున్నాడని క్యాటరింగ్‌ సిబ్బంది దారుణానికి పాల్పడ్డారు. ఆ బాలుడ్ని అమాంతం ఎత్తి మండుతున్న తందూర్ పొయ్యి మంటలోకి విసిరేశాడు. దీంతో బాలుడు ఒళ్లంతా తీవ్రంగా కాలిపోయింది. హుటాహుటీన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా..

పెళ్లి విందులో పదేపదే రసగుల్లాలు తింటున్నాడనీ.. మండే తందూర్‌ పొయ్యిలో బాలుడిని విసిరేశాడు!
Caterer Throws Boy Into Tandoor
Srilakshmi C
|

Updated on: Apr 17, 2026 | 5:34 PM

Share

లక్నో, ఏప్రిల్ 17: పెళ్లి విందులో ఓ బాలుడు పలుమార్లు రసగుల్లాలు తీసుకున్నాడని క్యాటరింగ్‌ సిబ్బంది దారుణానికి పాల్పడ్డారు. ఆ బాలుడ్ని అమాంతం ఎత్తి మండుతున్న తందూర్ పొయ్యి మంటలోకి విసిరేశాడు. దీంతో బాలుడు ఒళ్లంతా తీవ్రంగా కాలిపోయింది. హుటాహుటీన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని దుర్జన్పూర్‌ గ్రామంలో ఏప్రిల్‌ 15న ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. ఈ పెళ్లి వేడుకకు చమన్‌ (11) అనే బాలుడు తన అమ్మమ్మతో కలిసి అక్కడి బంధువుల పెళ్లి వేడుకకు వెళ్లాడు. పెళ్లిలోని విందు భోజనం సమయంలో ఆ బాలుడు పలుమార్లు రసగుల్లాలు తీసుకున్నాడు. గమనించిన క్యాటరింగ్ కాంట్రాక్టర్‌ బాలుడిపై తీవ్రంగా ఆగ్రహించాడు. తొలుత చమన్‌ను పట్టుకుని బెదిరించాడు. అయినప్పటికీ బాలుడు పదే పదే రసగుల్లాలు తీసుకోవడంతో అతడ్ని అమాంతం పైకి ఎత్తి మండుతున్న తందూర్‌ పొయ్యి వద్దకు తీసుకెళ్లాడు. ఇంతలో చేయి పట్టుతప్పి బాలుడు తందూర్‌ మంటల్లో పడిపోయాడు. దీంతో క్యాటరింగ్‌ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడున్న పెళ్లి అతిథులు వెంటనే తందూర్‌ పొయ్యిలో పడిపోయిన చమన్‌ను బయటకు తీశారు. ముఖం నుంచి నడుము వరకు తీవ్రంగా కాలిపోవడంతో వెంటనే అయోధ్య మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడ్ని లక్నో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న చమన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

చమన్‌ చిన్న తనంలోనే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి బాలుడు బస్తీలోని బఘనాలాలో ఉన్న తన అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. ప్రస్తుతం 2వ తరగతి చదువుతున్న చమన్.. బుధవారం మలౌలి గోసాయి గ్రామంలో బంధువుల పెళ్లి ఉండటంతో అమ్మమ్మతో కలిసి అక్కడికి వెళ్లాడు. చమన్ ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఉండగా.. ఉన్నట్టుండి ఆహార కౌంటర్ల వైపు వెళ్లి, అక్కడ ఒక స్టాల్‌లో ఉంచిన రసగుల్లాలు తినడం మొదలుపెట్టాడు. పలుమార్లు హెచ్చరించినా బాలుడు మాటవినకపోవడంతో క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌ చమన్‌ను మండే పొయ్యిలో విసిరేశాడు. చమన్‌ మేనమామ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గుర్తుతెలియని క్యాటరింగ్‌ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..