Madhya Pradesh: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణం ఏమిటంటే..?

|

Nov 21, 2022 | 11:42 AM

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఆయన ఓ 38 ఏళ్ల మహిళపై అత్యాచారం దాడి చేశాడనే ఆరోపణలతో..

Madhya Pradesh: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణం ఏమిటంటే..?
Umang Singhar
Follow us on

ప్రజలను సరైన మార్గంలో నడిపించేందుకు ప్రభుత్వం పెద్ద అన్న పాత్ర పోషిస్తుంది. మార్గం తప్పినప్పుడు శిక్షిస్తూ, మంచి పనులు చేసినప్పుడు వారిని ప్రశంసిస్తూ, సత్కరిత్సూ దిశానిర్దేశం చేస్తుంది. కానీ ప్రభుత్వమే, లేదా ఒకప్పటి ప్రభుత్వంలోని నాయకులే తప్పులు చేసుకుంటూ పోతే.. సమాజం ఏమవుతుంది? ఈ రోజుల్లో సామన్యుల కంటే రాజకీయ నాయకులే క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఆయన ఓ 38 ఏళ్ల మహిళపై అత్యాచారం దాడి చేశాడనే ఆరోపణలతో ఆ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీనియర్ అధికారి ప్రతాప్ సింగ్ సోమవారం తెలిపిన సమాచారం ప్రకారం.. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘర్‌తో కలిసి ‘భార్య’గా జీవిస్తున్నానని, అతను తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆదివారం సాయంత్రం ధార్ నగరంలోని నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.

గంద్వాని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఉమాంగ్ సింఘర్‌పై ఈ ఆరోపణలు రావడంతో.. కాంగ్రెస్ కమిటీ మీడియా విభాగం చైర్మన్ కెకె మిశ్రా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ కేసు గురించి తన వద్ద సమాచారం లేదని, అయితే ప్రాథమికంగా ఇది ‘రాజకీయ కుట్ర’ కేసుగా అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే శారీరక హింస, అత్యాచారం, వేధింపులు, అసహజ చర్యలకు పాల్పడడం, చంపేస్తామని బెదిరించడంపై కాంగ్రస్ ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ సింగ్ తెలిపారు.

ఆమె ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘర్‌పై ఐపీసీ 294, 323, 376 (2), 377 , 498 (ఏ) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామని ఓ షోలీసు అధికారి తెలిపారు. దర్యాప్తు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఒక వీడియో ప్రకటనలో ఎమ్మెల్యే సిఘర్‌పై అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఎమ్మెల్యేకు ఇతర భార్యలు కూడా ఉన్నారని బీజేపీ నేత మిశ్రా పేర్కొన్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..