Bharat Jodo Yatra: రాహుల్ గాంధీపై కర్ణాటకలో కేసు నమోదు.. అలా చేసినందుకే..

|

Nov 05, 2022 | 3:41 PM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కాపీరైట్‌ యాక్ట్‌ కింద బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్‌-2 హిందీ వర్షెన్‌ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన..

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీపై కర్ణాటకలో కేసు నమోదు.. అలా చేసినందుకే..
Rahul Gandhi
Follow us on

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కాపీరైట్‌ యాక్ట్‌ కింద బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్‌-2 హిందీ వర్షెన్‌ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన MRT మ్యూజిక్ సంస్థ రాహుల్ గాంధీ సహా మరో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై కేసు పెట్టింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పాదయాత్ర దృశ్యాలకు బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్‌-2 హిందీ సినిమా పాటలు, సంగీతాన్ని వాడుకున్నారు. దీనిపై ఆ సినిమా మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకున్న బెంగళూరుకు చెందిన ఎమ్‌ఆర్‌టీ సంస్థ కాపీ రైట్ ఉల్లంఘన కింద రాహుల్‌ గాంధీ, సుప్రియా శ్రీనాథ్‌, జైరామ్‌ రమేశ్‌పై కేసు పెట్టింది. కేజీఎఫ్‌-2 హక్కుల కోసం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశామని సదరు సంస్థ తెలిపింది. భారత్ జోడో యాత్ర కోసం తమ అనుమతి లేకుండానే పాటలను వాడుకుందని ఆరోపించింది. భారత్‌ జోడో యాత్ర ప్రచారం కోసం రూపొందించిన వీడియోలకు తమ అనుమతి లేకుండా కేజీఎఫ్‌-2 హిందీ పాటలను వాడుకోవడం కాపీరైట్ ఉల్లంఘనేనని స్పష్టం చేసింది.

ఐపిసి సెక్షన్లు 403, 465 , 120 కింద కాంగ్రెస్ పార్టీతో పాటు, రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాథ్‌, జైరామ్‌ రమేశ్‌పైపోలీసులు కేసు నమోదు చేశారు. MRT మ్యూజిక్ యాజమాన్యం కాపీరైట్‌లను కలిగి ఉన్న పాటను వారి అనుమతి లేకుండా ప్రచారానికి వాడుకోవడం ద్వారా కాపీరైట్ నిబంధనలను ఉల్లఘించినందున ఫిర్యాదు దాఖలు చేసినట్లు MRT మ్యూజిక్ సంస్థ తరపు న్యాయవాది నరసింహన్ సంపత్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఒక జాతీయ రాజకీయ పార్టీ చేసిన ఈ విధంగా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడటం నేరమేని MRT మ్యూజిక్ సంస్థ తరపు న్యాయవాది పేర్కొన్నారు.MRT మ్యూజిక్ సంస్థ ఆ పాటలపై కాపీ రైట్ హక్కులను మాత్రమే కలిగి ఉందని, తన చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవడానాకి మాత్రమే ఫిర్యాదు చేశామని, ఏ రాజకీయ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశం లేదని సంస్థ స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..