Capt Amarinder Singh: రంగం సిద్ధమైంది. ముహూర్తం ఫిక్సయ్యింది. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ బీజేపీలో చేరబోతున్నారు. లండన్ నుంచి రాగానే తన పార్టీని బీజేపీలో కలిపేయనున్నారు అమరీందర్. పంజాబ్ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ PLCPని బీజేపీలో విలీనం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత అయిన 89 ఏళ్ల అమరీందర్‌సింగ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. బ్యాక్‌బోన్ సర్జరీ కోసం ఆయన లండన్ వెళ్లారు. గత వారమే కెప్టెన్‌కు సర్జరీ పూర్తయింది. అమరీందర్‌కు ఫోన్ చేసి పరామర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. అమరీందర్ సింగ్ వచ్చే వారం లండన్ నుంచి పంజాబ్‌కు తిరిగి రానున్నారు. వచ్చీరాగానే బీజేపీలో చేరడంతో పాటు తన పార్టీ PLCPని బీజేపీలో విలీనం చేయనున్నారు.
కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా.. మూడు సార్లు సీఎంగా ఉన్న అమరీందర్‌సింగ్‌ను గతేడాది సీఎం పదవి నుంచి తప్పించింది అధిష్ఠానం. అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్‌ను వీడారు. అప్పుడే బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి. అనూహ్యంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఘోరంగా ఓడిపోయారు. కనీసం డిపాజిట్ దక్కలేదు. ఎన్నికల తర్వాత పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అమరీందర్ కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి