AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై.. రైళ్లు లేవు.. ఫుట్ పాత్ పైనే వలస కార్మికుల పడిగాపులు

ముంబై నగరంలో వందలాది వలసకార్మికులు మూడు రోజులుగా ఫుట్ పాత్ పైనే గడుపుతున్నారు. రాత్రుళ్ళు అక్కడే నిద్రపోతున్నారు. శ్రామిక్ రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లడానికి వీరంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అద్దె చెల్లించలేకపోవడం వల్ల..   తాము ఉంటున్న ఇళ్ల యజమానులు ఇళ్లను ఖాళీ చేయమని బెదిరించడంతో ఆ వలస జీవులందరూ వడాలా పోలీసు స్టేషను వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం రైళ్లను రద్దు చేయడంతో వీరికి ఏం చేయాలో తోచడం లేదు. చేతిలో డబ్బు లేదు.. […]

ముంబై.. రైళ్లు లేవు.. ఫుట్ పాత్ పైనే వలస కార్మికుల పడిగాపులు
Umakanth Rao
| Edited By: |

Updated on: May 23, 2020 | 1:46 PM

Share

ముంబై నగరంలో వందలాది వలసకార్మికులు మూడు రోజులుగా ఫుట్ పాత్ పైనే గడుపుతున్నారు. రాత్రుళ్ళు అక్కడే నిద్రపోతున్నారు. శ్రామిక్ రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లడానికి వీరంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అద్దె చెల్లించలేకపోవడం వల్ల..   తాము ఉంటున్న ఇళ్ల యజమానులు ఇళ్లను ఖాళీ చేయమని బెదిరించడంతో ఆ వలస జీవులందరూ వడాలా పోలీసు స్టేషను వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం రైళ్లను రద్దు చేయడంతో వీరికి ఏం చేయాలో తోచడం లేదు. చేతిలో డబ్బు లేదు.. తినడానికి తిండి లేదు.  లాక్ డౌన్ కారణంగా ఫ్యాక్టరీలు మూత బడడంతో చేతిలో పని లేకుండా పోయింది. ఈ వలస జీవుల్లో తొమ్మిది నెలల గర్భిణి కూడా ఉంది. అద్దె ఇళ్లకు తాము ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలని వీరు దీనంగా ప్రశ్నిస్తున్నారు. తమకు ఏదో ఒక దారి చూపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మహారాష్ట్రలో 44 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 1500 మంది కరోనా రోగులు మరణించారు. వీరిలో ఒక్క ముంబైలోనే మృతుల సంఖ్య అత్యధికంగా ఉంది.

కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..