అంబానీని వెంటాడుతున్న అప్పులు..మూడు వారాల్లో కట్టాలంటూ కోర్టు ఆదేశాలు

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని అప్పులు వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఒకటి తర్వాత ఒకటిగా వేధిస్తున్నాయి. తాజాగా ...బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మొత్తం మూడు వారాల్లోగా చెల్లించాలంటూ యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అంబానీని వెంటాడుతున్న అప్పులు..మూడు వారాల్లో కట్టాలంటూ కోర్టు ఆదేశాలు
Follow us

|

Updated on: May 23, 2020 | 12:27 PM

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని అప్పులు వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఒకటి తర్వాత ఒకటిగా వేధిస్తున్నాయి. తాజాగా రుణ ఒప్పందంలో భాగంగా మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మొత్తం చెల్లించాలంటూ అనిల్ అంబానీకి మే 22న యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పు చెల్లించేందుకు గానూ మూడు వారాల గడువు ఇచ్చిన కోర్టు ఆ లోగా పూర్తి రుణం చెల్లించాలని, లేదంటే చర్యలు తప్పవని యూకే కోర్టు హెచ్చరింది.

2012 ఫిబ్రవరిలో రిలయన్స్ కామ్ మూడు చైనీస్ బ్యాంకుల నుంచి దాదాపు రూ. 5446 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ అప్పుకు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీయే హామీగా ఉన్నారు. ప్రస్తుతం రిలయన్స్ కామ్ దివాళాలో ఉండటంతో తమ అప్పు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ చైనా బ్యాంకులు లండన్ కోర్టును ఆశ్రయించాయి. లాక్‌డౌన్ కారణంగా పిటిషన్‌ను లండన్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పిటిషనర్ వాదనలు విన్న కోర్టు..అనిల్ అంబానీని రుణం మొత్తం చెల్లించాలని ఆదేశించింది. మూడు వారాల్లో అప్పు మొత్తం చెల్లించాల్సిందేనంటూ తీర్పు చెప్పింది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కోర్టు ఆదేశించింది.