Indian Railway: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ రైళ్లు రద్దు, దారి మళ్లింపు.. వివరాలు చెక్ చేసుకోండి

|

Jun 15, 2022 | 5:32 PM

Indian Railways Passenger Alert: ట్రాక్ మెయింటెనన్స్ కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేయనున్నట్లు రైల్వే శాఖ వివిధ ప్రకటనల్లో తెలిపింది. ఆ వివరాలను చెక్ చేసుకోండి.

Indian Railway: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ రైళ్లు రద్దు, దారి మళ్లింపు.. వివరాలు చెక్ చేసుకోండి
Railway News
Follow us on

కోవిడ్ పాండమిక్ తర్వాత రైళ్లు మళ్లీ మునుపటి స్థాయిలో నడుస్తున్నాయి. దాదాపు అన్ని మార్గాల్లోనూ రైళ్లను రైల్వే శాఖ పునరుద్ధరించింది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దేశ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అదే సమయంలో వివిధ రైల్వే డివిజన్ల పరిధిలో ట్రాక్ మెయింటెన్స్ కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే శాఖ విడివిడిగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. రైళ్ల రాకపోకల్లో మార్పులకు అనుగుణంగా ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని సాంబల్‌పూర్ డివిజన్‌లో ట్రాక్ మెయింటెనన్స్ కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటన మేరకు జూన్ 26వ తేదీన తిరుపతి- బిలాస్‌పూర్ రైలు (నెం.17482)ను రద్దు చేశారు. అలాగే జూన్ 16న తిరుపతి నుంచి బిలాస్‌పూర్ వెళ్లాల్సిన రైలు (నెం.17482) ఉదయం 10.50 గం.లకు కాకుండా మధ్యాహ్నం 03.50 గం.లకు బయలుదేరి వెళ్లనుంది. అలాగే H.S.నాందేడ్ – సాంబల్‌పూర్ రైలు (నెం.20810) జూన్ 21, 28 తేదీల్లో సాయంత్రం 04.35 గం.లకు కాకుండా రాత్రి 07.35 గం.లకు బయలుదేరి వెళ్లనుంది. అలాగే సాంబల్‌పూర్ నుంచి H.S.నాందేడ్‌కు వెళ్లే రైలు (నెం.20809) జూన్ 27న ఉదయం. 10.50 గం.లకు కాకుండా మధ్యాహ్నం 12.50 గం.లకు బయలుదేరి వెళ్లనుంది.

అలాగే సథరన్ రైల్వే పరిధిలోని చెన్నై సెంట్రల్ – గూడూరు సెక్షన్‌లో ట్రాక్ మెయింటనెన్స్ కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని పాక్షికంగా రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. జూన్ 28న నెల్లూరు- సూళ్లూరుపేట్ మధ్య నడిచే రైళ్లను (నెం.06746/06745) రద్దు చేశారు. అలాగే జూన్ 28వ తేదీన విజయవాడ – చెన్నై సెంట్రల్ రైలు (నెం.12711)ను గూడూరు వరకు మాత్రమే నడపనున్నారు. జూన్ 28వ తేదీన చెన్నై సెంట్రల్ – విజయవాడ రైలు (నెం.12712)ను గూడూరు నుంచి విజయవాడ వరకు నడపనున్నారు. జూన్ 22న పుదుచ్చేరి – న్యూ ఢిల్లీ రైలు (నెం.22403)ను చెంగల్పట్టు, అరక్కోణం, పెరంబూర్, కొరుక్కుపేట మార్గం మీదుగా దారిమళ్లించారు.

ఇవి కూడా చదవండి

సౌత్ వెస్టర్న్ రైల్వే పరిధిలోని బెలగావి-సుల్‌దాల్ సెక్షన్‌లో ట్రాక్ మెయింటెనెన్స్ కారణంగా కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. జూన్ 22 నుంచి 28వ తేదీ వరకు తిరుపతి -కొల్హాపూర్ రైలు (నెం.17415)ను ధార్వాడ్ వరకు మాత్రమే నడపనున్నారు. ధార్వాడ్ నుంచి కొల్హాపూర్ వరకు రైలును రద్దు చేశారు. అలాగే 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కొల్హాపూర్ నుంచి తిరుపతి వరకు నడిచే రైలు (నెం.17416)ను కొల్హాపూర్ నుంచి ధార్వాడ్ వరకు రద్దు చేశారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..