Bengal: ముర్షీదాబాద్‌లో అల్లర్ల నేపథ్యంలో కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు!

ముర్షీదాబాద్‌లో అల్లర్లను అదుపు చేయడానికి కేంద్ర బలగాలను కొనసాగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లపై హైకోర్టులో బెంగాల్‌ ప్రభుత్వం 34 పేజీల నివేదికను అందచేసింది. ముర్షీదాబాద్‌లో శుక్రవారం(ఏప్రిల్ 18) జాతీయ మానవ హక్కుల సంఘం బృందంతో పాటు గవర్నర్‌ ఆనందబోస్‌ పర్యటించనున్నారు.

Bengal: ముర్షీదాబాద్‌లో అల్లర్ల నేపథ్యంలో కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు!
Central Armed Police Forces

Updated on: Apr 17, 2025 | 8:43 PM

ముర్షీదాబాద్‌లో అల్లర్లను అదుపు చేయడానికి కేంద్ర బలగాలను కొనసాగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లపై హైకోర్టులో బెంగాల్‌ ప్రభుత్వం 34 పేజీల నివేదికను అందచేసింది. ముర్షీదాబాద్‌లో శుక్రవారం(ఏప్రిల్ 18) జాతీయ మానవ హక్కుల సంఘం బృందంతో పాటు గవర్నర్‌ ఆనందబోస్‌ పర్యటించనున్నారు.

వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో హింసపై కలకత్తా హైకోర్టులో విచారణ జరిగింది. అల్లర్లపై NIA దర్యాప్తు చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అంతేకాకుండా ముర్షీదాబాద్‌తో పాటు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బలగాల కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర బలగాలను కొనసాగించడానికి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ముర్షీదాబాద్‌ అల్లర్లపై హైకోర్టుకు 34 పేజీల నివేదికను బెంగాల్‌ ప్రభుత్వం అందచేసింది.

మరోవైపు ముర్షీదాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో జాతీయ మానవ హక్కుల సంఘం బృందం పర్యటిస్తోంది. అల్లర్ల బాధితులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. టారు బృందం సభ్యులు. బెంగాల్‌లో హింస వెనుక బంగ్లాదేశ్‌ చొరబాటుదారుల హస్తముందని బీజేపీ ఆరోపిస్తోంది. హింసకు సంబంధించిన వీడియోలను బీజేపీ నేతలు హైకోర్టుకు సమర్పించారు.

మరోవైపు బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ ముర్షీదాబాద్‌లో శుక్రవారం పర్యటిస్తారు. ముర్షీదాబాద్‌లో ప్రశాంత పరిస్థితులు నెలకొనడంపై హర్షం వ్యక్తం చేశారు ఆనందబోస్‌. అయితే ఇలాంటి సమయంలో ఎవరు కూడా ముర్షీదాబాద్‌ వెళ్లకపోతే బాగుంటుందన్నారు సీఎం మమత. తాను మాత్రం పరిస్థితి అంచనా వేయడానికి ముర్షీదాబాద్‌ వెళ్తునట్టు తెలిపారు. హింసాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల పహారా కొనసాగిస్తామని హైకోర్టుకు కేంద్రం వెల్లడించింది.

ముర్షీదాబాద్‌ అల్లర్లపై హైకోర్టుకు బెంగాల్‌ ప్రభుత్వం నివేదికను అందచేసింది. శుక్రవారం వరకు ఇంటర్నెట్‌ సస్సెండ్‌ చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించింది. అల్లర్లపై దర్యాప్తుకు సిట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అల్లర్లపై 60 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని , అల్లరిమూకలు ఇద్దరిని హత్య చేశారని నివేదికలో పేర్కొన్నారు. అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపినట్టు బెంగాల్‌ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఆకస్మాత్తుగా 10 వేల మంది ర్యాలీ చేపట్టడంతో పరిస్థితి అదుపు తప్పిందని వివరించింది. కలకత్తా హైకోర్టు ముర్షీదాబాద్‌ అల్లర్లపై విచారణను ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా వేసింది.

బెంగాల్‌లో అల్లర్లను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్‌ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. మరోవైపు అల్లర్లు చెలరేగిన నార్త్‌ 24 పరగణ జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. కమిషనర్‌ మనోజ్‌ కుమార్ స్వయంగా వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు. శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా జరుపుకోవాలని , అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముర్షీదాబాద్‌లో అల్లర్ల కారణంగా చాలామంది పొరుగున ఉన్న జార్ఖండ్‌కు పారిపోయారు. జార్ఖండ్‌ లోని పామూరులో జనం క్యాంప్‌ల్లో అష్టకష్టాలు పడుతున్నారు.