Cable Bridge Collapse Updates: గుజరాత్‌ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

|

Oct 31, 2022 | 5:24 AM

గుజరాత్‌లో కూలిపోయిన కేబుల్‌ బ్రిడ్జి కూలిన ఘటన కన్నీటిని మిగిల్చింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా కేబుల్‌ బ్రిడ్జి కూలిపోవడంతో 91 మందికిపైగా మృతి చెందారు. ఎంతో మంది తీవ్ర..

Cable Bridge Collapse Updates: గుజరాత్‌ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
Gujarat Cable Bridge Collapse Updates
Follow us on

గుజరాత్‌లో కూలిపోయిన కేబుల్‌ బ్రిడ్జి కూలిన ఘటన కన్నీటిని మిగిల్చింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా కేబుల్‌ బ్రిడ్జి కూలిపోవడంతో 91 మందికిపైగా మృతి చెందారు. ఎంతో మంది తీవ్రం గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వంతెన కూలిపోవడంతో నదిలో పడిన వారిని రక్షించేందుకు అధికారులు స్థానిక ప్రజల సహకారంతో ప్రయత్నించారు. తర్వాత ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఇతర సహాయక బృందాలను హుటాహుటిన ఘటన స్థలానికి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 200 మందికిపైగా రక్షించారు. మృతుల సంఖ్య 91కిపైగా చేరుకుంది. మరణించే వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించగా, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

 

ఇవి కూడా చదవండి


ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ట్వీట్‌ చేశారు.

 


ప్రమాదం జరుగగానే రెస్క్యూ టీమ్‌తో పాటు అంబులెన్స్‌లను సైతం సిద్ధం చేశారు. వెంటవెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ఫోన్‌ చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. పరిస్థితిని నిశితంగా,నిరంతరం పర్యవేక్షించాలని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని ప్రధాని కోరారు.

ఇదిలావుండగా, సీఎం భూపేంద్ర పటేల్ ట్వీట్ చేస్తూ, మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, అలాగే గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రధాని మోడీ ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని గాంధీనగర్‌కు చేరుకుంటున్నట్లు సీఎం పటేల్ తెలిపారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలకు మార్గనిర్దేశం చేయాలని రాష్ట్ర హోంమంత్రిని కోరారు.

 


కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ, ఇతర రాష్ట్ర అధికారులతో కూడా మాట్లాడారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి