Bulldozer Toys: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో వరసగా రెండోసారి బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) పదవిని చేపట్టారు. ప్రస్తుతం సీఎం యోగిని బుల్‌డోజర్ బాబా అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి బుల్‌డోజర్ ఒక ఐకాన్ గా మారింది. దీంతో ఇప్పుడు చిన్న చిన్న బొమ్మల బుల్‌డోజర్లు.. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో గిఫ్ట్ ఐటెమ్ గా మారాయి. తాజగా ప్రయాగ్‌రాజ్‌లోని కత్రాలో చౌరాసియా కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించారు. తొమ్మిది జంటలు పెళ్లి చేసుకున్నాయి. వివాహం చేసుకున్న ఈ 9జంటలకు బుల్‌డోజర్ బొమ్మతో పాటు గృహోపకరణాలతో సహా ఇతర బహుమతులు అందించారు.
ఇదే విషయంపై ప్రయాగ్‌రాజ్ మేయర్ అభిలాషా గుప్తా మాట్లాడుతూ బుల్‌డోజర్ మహిళల భద్రతకు ప్రతీక అని, అలాగే ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కూడా ప్రతీక అని అన్నారు.
రాష్ట్రంలో శాంతి, సామరస్య వాతావరణాన్ని నెలకొల్పినందుకు ఇప్పుడు బుల్‌డోజర్ బాబాగా పిలుచుకునే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వధువులు అందరూ సమిష్టిగా కృతజ్ఞతలు తెలిపారు. బుల్‌డోజర్‌ను యోగి ఆదిత్యనాథ్ సీఎం గా మొదటి టర్మ్‌లో మాఫియా, నేరస్థులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను కూల్చివేయడానికి విస్తృతంగా ఉపయోగించారన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను బుల్‌డోజర్‌తో కూలగొట్టారు. దీంతో అప్పటి నుంచి సరదాగా సీఎం యోగిని బుల్ డోజర్ బాబా అని పిలుచుకుంటున్నారు.
Also Read: 1 April New Rules: కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు..!