Bulldozer: పాత వంతెన ఒకదానిని కూల్చివేసేందుకు వెళ్లిన జేసీబీ యంత్రం ఒక్కసారిగా జారి నీళ్లలోకి పడిపోయింది. దాంతో ఆ బుల్డొజర్ నడుపుతున్న డ్రైవర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బుల్‌డోజర్ కాలువలో మునిగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. గంగా కాలువపై వంతెన కూలిపోవడంతో బుల్డోజర్ డ్రైవర్ తృటిలో ప్రాణాలు కాపాడుకున్నాడు. జనసత్ ప్రాంతంలోని పాత, శిథిలావస్థలో ఉన్న వంతెనను కూల్చివేస్తుండగా బుల్డోజర్ కాలువలో పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో గంగా కాలువపై ఉన్న వంతెన కూల్చివేస్తుండగా బుల్డొజర్ ఉన్నట్టుండి నీటిలోకి కుప్పకూలింది. దాంతో బుల్డోజర్ డ్రైవర్ తృటిలో తన ప్రాణాలను కాపాడుకున్నాడు. జనసత్ ప్రాంతంలోని పాత, శిథిలావస్థలో ఉన్న వంతెనను కూల్చివేస్తుండగా బుల్డోజర్ కాలువలో పడిపోయింది.
कवि जिस डाल पर बैठा था, उसी को काट रहा था
Video from UP’s Muzaffarnagar. A bulldozer was demolishing an old, dilapidated bridge in Jansath area. The bridge suddenly submerged in the canal taking down the bulldozer with it. Driver escaped unhurt. pic.twitter.com/uIfTiQAKjX
— Piyush Rai (@Benarasiyaa) September 26, 2022
ముజఫర్‌నగర్‌లోని ఇరుకైన వంతెన పై బుల్‌డోజర్‌ను ఉంచిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వంతెన మొదటి భాగం కూలిపోయిన తర్వాత, అది ఒక డొమినో ఎఫెక్ట్‌గా మారింది. దీని వలన వంతెన ఇతర భాగాలు కూడా కూలిపోయాయి. వంతెన మొత్తం కూలిపోవడంతో జేసీబీ బుల్‌డోజర్‌ను తీసుకెళ్లింది. నీటిలో కుప్పకూలిన వంతెన 100 ఏళ్ల నాటిదని అధికారులు తెలిపారు. కాలువ వెంబడి పానిపట్-ఖతిమా హైవేను విస్తరించే ప్రాజెక్టులో భాగంగా కూల్చివేత పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి