
కాస్త మెల్లిగా మాట్లాడుకోండి అన్న పాపానికి ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బన్నేర్‌ఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ కేసులో ఓ బాలుడితో సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. కెంచగయ్యనదొడ్డి వాసి కాంతికుమార్ అలియాస్ సైకో కాంతి (27), గోపాల్ అలియాస్ గొబ్బు రాజా (40), కిరణ్ కుమార్ అలియాస్ సఫీన్స్ (28), ఒక బాలుడిని అరెస్టు చేశారు. మరో నిందితుడు వినోద్ (30) కోసం పోలీసులు గాలిస్తున్నారు.
షానుబోగనహళ్లిలోని తరంగిణి బార్‌లో నిందితులు తాగి గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. దీంతో సురేష్ అనే కుర్రాడు అంత గట్టిగా మాట్లాడవద్దని, కాస్త మెల్లిగా మాట్లాడమని కోరాడు. అప్పుడు సైలెంట్‌గా ఉన్న నిందితులు.. సురేష్‌ను ఫాలో అయి అతని ఇంటికి వెళ్లి అతని భార్య, పిల్లల ముందే అతన్ని కత్తితో పొడిచి చంపారు. అతన్ని చంపి, అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదుతో బన్నేరుఘట్ట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..