G20 Summit: ఢిల్లీలో అడుగు పెట్టిన రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధాని అయిన తర్వాత మొదటిసారి

|

Sep 08, 2023 | 2:19 PM

శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై రుషి సునాక్‌ హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన దేశానికి జీ20 సదస్సు నిర్వహించే అవకాశం వచ్చిందన్నారు. యూకే, భారత్ మధ్య ఉన్న సంబంధం వర్తమానం కంటే రెండు దేశాల భవిష్యత్తును ఎక్కువగా నిర్వచిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. భారత్‌లో శనివారం, ఆదివారం జరగనున్న సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను పరిష్కరించేందుకు భారత్‌తో కలిసి పని చేస్తామని..

G20 Summit: ఢిల్లీలో అడుగు పెట్టిన రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధాని అయిన తర్వాత మొదటిసారి
Rishi Sunak Lands In Delhi
Follow us on

బ్రిటన్‌ ప్రధాని, భారతదేశానికి అల్లుడు.. రిషి సునాక్‌ ఇండియాకు విచ్చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన మనదేశానికి వచ్చేశారు. బ్రిటీష్ ప్రధాన మంత్రి అయ్యాక రిషి సునాక్ మొదటిసారి రావడంతో ఘనస్వాగతం పలికారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రిషి సునాక్‌కు ఘనస్వాగతం పలికారు. అటు సునాక్‌ బంధువులు కూడా ఆయన్ని ఆహ్వానించేందుకు భారీగా ఎయిర్‌పోర్టుకు వచ్చారు. రిషి సునాక్‌కు ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్‌లో బస ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ఆయన నేరుగా షాంగ్రిలా హోటల్‌కు వెళ్తారు.

ఇదిలా ఉంటే ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై రుషి సునాక్‌ హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన దేశానికి జీ20 సదస్సు నిర్వహించే అవకాశం వచ్చిందన్నారు. యూకే, భారత్ మధ్య ఉన్న సంబంధం వర్తమానం కంటే రెండు దేశాల భవిష్యత్తును ఎక్కువగా నిర్వచిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. భారత్‌లో శనివారం, ఆదివారం జరగనున్న సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను పరిష్కరించేందుకు భారత్‌తో కలిసి పని చేస్తామని రిషి సునాక్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం మొదలు వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడం వరకు అన్నింటిలోనూ పాలు పంచుకుంటామన్నారు.

జి-20 పర్యటనకు ముందు ఢిల్లీలో రిషిసునాక్‌ కుటుంబం, బంధువులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వారంతా ఢీల్లీ చేరుకున్నారు. సునాక్‌ బంధువులు పంజాబీ సంగీతం, పూల బొకేలతో స్వాగతం పలికి, నాన్‌స్టాప్ డ్యాన్స్‌తో విందును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీజీ షెడ్యూల్‌ కారణంగా రుషి సునాక్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతారా..? లేదా అనేది క్లారిటీ రాలేదు.

ఇవి కూడా చదవండి

రిషి సునాక్‌ ప్రస్థానం ఇదీ..

ఇక రిషి సునాక్‌ 1980 మే 12న సౌథాంప్టన్‌లో జన్మించారు. ఆయన పూర్వీకుల మూలాలు పంజాబ్‌లో ఉన్నాయి. పంజాబ్ నుంచి వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. అక్కడ సంతానం కల్గిన తర్వాత పిల్లలతో కలిసి ఇంగ్లండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రిషి సునాక్ తండ్రి యశ్‌వీర్‌ కెన్యాలో, తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలస వెళ్లిన తర్వాత అక్కడే స్థిరపడ్డారు. రుషి సునాక్‌ భార్య, బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ,సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షతామూర్తి. సునాక్‌ బంధువులు పంజాబ్‌లో పెద్దసంఖ్యలో ఉండగా, భార్య తరఫున బంధువులు కర్నాటకలో ఉన్నారు.

ముస్తాబైన ఢిల్లీ..

జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సిద్ధమైంది. ఇప్పటికే కొంతమంది సభ్య దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాకతో సందడి మొదలైంది. అగ్రదేశాల నేతలు ఇప్పటికే పలువురు భారత్‌ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సనాక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు రెండు రోజుల పాటు ఢిల్లీలో ఆతిథ్యం ఇవ్వనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..