UK Jane Marriott Visit PoK: పీఓకేలో బ్రిటీష్ హైకమిషనర్ పర్యటన.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్!

|

Jan 13, 2024 | 5:40 PM

బ్రిటీష్ హైకమిషనర్ జేన్ మారియట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) పర్యటనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జేన్ మారియట్ పర్యటనపై భారత ప్రభుత్వం తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. బ్రిటిష్ హైకమిషనర్ ఈ పర్యటనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అభ్యంతరకరంగా అభివర్ణించింది.

UK Jane Marriott Visit PoK: పీఓకేలో బ్రిటీష్ హైకమిషనర్ పర్యటన.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్!
British High Commissioner Jane Marriott
Follow us on

బ్రిటీష్ హైకమిషనర్ జేన్ మారియట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) పర్యటనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జేన్ మారియట్ పర్యటనపై భారత ప్రభుత్వం తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. బ్రిటిష్ హైకమిషనర్ ఈ పర్యటనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అభ్యంతరకరంగా అభివర్ణించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇది తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది.

బ్రిటీష్ విదేశాంగ కార్యాలయ అధికారితో కలిసి 2024 జనవరి 10న పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు ఇస్లామాబాద్‌లోని బ్రిటీష్ హైకమిషనర్ అత్యంత అభ్యంతరకరమైన పర్యటనను తీవ్రంగా పరిగణించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంపై విదేశాంగ కార్యదర్శి భారతదేశంలోని బ్రిటీష్ హైకమిషనర్‌కు కూడా తీవ్ర నిరసన తెలిపారు. విదేశాంగ కార్యదర్శి ప్రకారం, జమ్మూ, కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాయి.

పాకిస్తాన్‌లో మొదటి మహిళా బ్రిటీష్ హైకమిషనర్ అయిన మారియట్ జనవరి 10న సోషల్ మీడియా వేదిక ‘X'(గతంలో ట్విట్టర్) పోస్ట్‌లో మీర్పూర్‌ను సందర్శించిన అనేక చిత్రాలను పంచుకున్నారు. “బ్రిటన్ – పాకిస్తాన్ ప్రజల మధ్య సంబంధాల మెరుగుపడాలని మీర్పూర్ వేదికగా శుభాకాంక్షలు! బ్రిటీష్ పాకిస్థానీలలో 70 శాతం మంది మీర్పూర్‌కు చెందినవారు, కాబట్టి ప్రవాసుల ప్రయోజనాల కోసం మనమందరం కలిసి పనిచేయడం చాలా ముఖ్యం. మీ ఆతిధ్యానికి ధన్యవాదాలు!” అంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

అలాగే జేన్ మారియట్ జనవరి 8న కూడా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. “ప్రస్తుతం నేను కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌లోని అన్ని ముఖ్యమైన రాజకీయ పార్టీలతో సమావేశమవుతున్నాను. ప్రాథమిక ఆర్థిక సంస్కరణలను కొనసాగించడం అవసరం. ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలు పాకిస్థాన్ భవిష్యత్తుకు ముఖ్యమైనవి.” అంటూ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…