కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న జంటను యూకే విమానాశ్రయంలో ఆపివేశారు.. ఎందుకంటే ..?

| Edited By: Phani CH

Jul 14, 2021 | 9:07 PM

కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ జంటను బ్రిటన్ మాంచెస్టర్ లోని విమానాశ్రయంలో అధికారులు కొద్దిసేపు ఆపివేసి వారిని తిప్పి పంపివేశారు. ఇందుకు వారు ఈ దేశంలో అనుమతి లేని ఈ టీకామందు తీసుకోవడమేనట..

కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న జంటను యూకే విమానాశ్రయంలో ఆపివేశారు.. ఎందుకంటే ..?
Covishield Vaccine
Follow us on

కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ జంటను బ్రిటన్ మాంచెస్టర్ లోని విమానాశ్రయంలో అధికారులు కొద్దిసేపు ఆపివేసి వారిని తిప్పి పంపివేశారు. ఇందుకు వారు ఈ దేశంలో అనుమతి లేని ఈ టీకామందు తీసుకోవడమేనట.. తమకు తెలియకుండానే ఈ జంట ఈ వ్యాక్సిన్ తీసుకుంది. ఇండియన్ వ్యాక్సిన్ అయిన ఈ టీకామందుకు ఇప్పటికీ యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ అనుమతి లేదు.. స్టీవ్ హార్డీ, గ్లెండా అనే వృద్ధ జంట మాల్టా లో ఉంటున్న తన కుమారుడిని చూసేందుకు మాంచెస్టర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. కానీ వీరికి అక్కడ చుక్కెదురైంది. నిజానికి ఈ వ్యాక్సిన్ ని కొన్ని లక్షలమంది తీసుకున్నారు. అయితే దీనికి యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ ఆమోదం ఇంకా లభించవలసి ఉంది. తాము ఈ వ్యాక్సిన్ ని గత మార్చి నెలలోనే తీసుకున్నామని, ఇలా దీనికి ఇంకా ఆమోదం లభించలేదని తమకు తెలియదని ఈ భార్యా భర్తలు వాపోతున్నారు. మాల్టాలో ఉంటున్న తమ కొడుకుని చూసి తాము ఏడాది గడిచిపోయిందన్నారు.

మేం కోవిడ్ కి సంబంధించిన ప్రతి ప్రోటోకాల్ ని పాటించామని, ఈ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ వ్యాక్సిన్ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించారేమోనని అనుమానిస్తున్నామని ఈ జంట పేర్కొంది. దీనికి యూరోపియన్ ఏజెన్సీ ఆమోదం లభించనప్పుడు ఇంకా దేశంలో ఎందుకు అనుమతించారన్న రీతిలో వారు మాట్లాడారు. ఈ దేశంలో ఇండియన్ వ్యాక్సిన్లు లేవని జాన్సన్ ఒక సందర్బంలో వ్యాఖ్యానించారని, అలాంటప్పుడు మా లాంటివారిలో మరింత అవగాహన కలిగించవలసిన అవసరం ఉంది కదా అని పేర్కొన్నారు. మాల్టాను యూకే గ్రీన్ లిస్టులో ఉంచింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి ఇంటివద్ద సీఐడీ బృందం.. పర్సనల్ గార్డ్ సూసైడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

RBI: షాకింగ్‌ న్యూస్‌.. ఇక ఆ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ