బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయ్యింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం సోమవారం అధికారిక నిర్ణయం తీసుకుంది.వాస్తవానికి ఈ ఏడాది జనవరి మాసంలో భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిన బోరిస్ జాన్సన్…బ్రిటన్‌లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటంతో వాయిదావేసుకున్నారు. ఈ నెల చివరి వారంలో ఆయన భారత్‌లో పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున బోరిస్ జాన్సన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, బ్రిటన్ ప్రభుత్వం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా బోరిస్ జాన్సన్ వచ్చే వారం భారత్‌లో పర్యటించలేకపోతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే ఈ నెలాఖరులో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్చువల్‌గా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. భారత్, యూకే ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి..కరోనా భయం గుప్పెట్లో ఏపీ సచివాలయం…మూడు రోజుల్లో నలుగురు మృతి
కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయండి.. హైకోర్టులో షబ్బీర్ అలీ పిటిషన్