
ఇప్పుడు ప్రపంచ దేశాల చూపంతా ఢిల్లీపై పడింది. ఒకవైపు రష్యా అధ్యక్షుడు వ్వాదిమిర్ పుతిన్, మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్. ఇద్దరితోనూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలకంగా మాట్లాడబోతున్నారు. అదే సమయంలో అమెరికాతోనూ భారత్ తన స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఒకరి కోసం ఇంకొకరిని వదిలేయడం లేదు. దేశానికి ఎక్కడ ఏది అవసరమో, అక్కడ దాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందినకాడికి అందిపుచ్చుకోవాలనే సామెతలా అన్ని వైపులా తలుపులు తెరిచి ఉంచుతోంది. ఇదే ఇప్పుడు ఢిల్లీలో కనిపిస్తున్న అసలు లెక్క. ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సదస్సు.. BRICSలో భారత్, రష్యా, చైనా సహా 11 దేశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో పెద్ద భాగం ఈ దేశాల్లోనే ఉంది. ప్రపంచ వ్యాపారంలోనూ వీటి వాటా గణనీయంగా ఉంది. అందుకే ఢిల్లీలో జరుగుతున్న సమావేశం మామూలు మీటింగ్ కాదు. యుద్ధాలు, చమురు ధరలు, వ్యాపారం, టెక్నాలజీ, అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు.. ఇలా ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఎన్నో అంశాలపై ఇక్కడ చర్చ జరగనుంది. ముఖ్యంగా.. అమెరికా, యూరప్ దేశాల మాటలతో పాటు మిగతా దేశాల గొంతుక కూడా ప్రపంచంలో బలంగా వినిపించాలన్నది BRICSలోని ప్రధాన ఆలోచన. పుతిన్‌తో మోదీ భేటీ.. ముందుగా పుతిన్‌తో మోదీ భేటీ అయ్యారు. రష్యా భారత్‌కు...