పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్‌ పరిధిలో ఉంది..! శత్రు దేశానికి రక్షణ మంత్రి మాస్‌ వార్నింగ్‌

లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో తయారైన బ్రహ్మోస్ క్షిపణులను రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరిక చేశారు, బ్రహ్మోస్ పరిధిలో పాక్ ప్రతి అంగుళం ఉందని అన్నారు. ఆపరేషన్ సింధూర్‌ను ప్రస్తావిస్తూ, భారత్ రక్షణలో స్వావలంబన సాధించిందని, బ్రహ్మోస్ వేగం, కచ్చితత్వంతో ప్రపంచంలోనే ఉత్తమ క్షిపణి అని కొనియాడారు.

పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్‌ పరిధిలో ఉంది..! శత్రు దేశానికి రక్షణ మంత్రి మాస్‌ వార్నింగ్‌
Rajnath Singh

Updated on: Oct 18, 2025 | 5:08 PM

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన సభలో ప్రసంగిస్తూ పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పొరుగు దేశంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలోనే ఉందని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సాయుధ దళాల ధైర్యసహసాలపై రాజ్‌నాథ్ తన వ్యాఖ్యలలో ప్రశంసలు కురిపించారు. కానీ అది కేవలం ‘ట్రైలర్’ మాత్రమే అని ఎత్తి చూపారు. బ్రహ్మోస్‌ను ప్రశంసిస్తూ భారత్‌ తన శత్రువులను విడిచిపెట్టదని ఆపరేషన్ సిందూర్ సమయంలో క్షిపణి వ్యవస్థ నిరూపించిందని రక్షణ మంత్రి అన్నారు.

విజయం మాకు అలవాటుగా మారింది. మన ప్రత్యర్థులు ఇకపై బ్రహ్మోస్ నుండి తప్పించుకోలేరని దేశం నమ్మకంగా ఉంది. పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం ఇప్పుడు మన బ్రహ్మోస్ చేతికి అందేంత దూరంలో ఉంది అని ఆయన అన్నారు. బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి కాదు, పెరుగుతున్న స్వదేశీ సామర్థ్యాలకు చిహ్నం. వేగం, కచ్చితత్వం, శక్తి ఈ కలయిక బ్రహ్మోస్‌ను ప్రపంచంలోని అత్యుత్తమ క్షిపణులలో ఒకటిగా చేస్తుంది అని ఆయన అన్నారు, బ్రహ్మోస్ భారత సాయుధ దళాలకు వెన్నెముకగా మారిందని అన్నారు.

ఇదే కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. బ్రహ్మోస్ క్షిపణులు భారతదేశ రక్షణ అవసరాలలో స్వావలంబనను సూచిస్తాయని అన్నారు. భారతదేశం ఇప్పుడు తన భద్రతా అవసరాలను తీర్చుకోగలదని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని మిత్ర దేశాల భద్రతా అవసరాలను కూడా తీర్చగలదని ఇది చూపిస్తుందని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి