Himachal Pradesh: ‘మీ మాస్క్ ఏదీ..’? హిమాచల్ ప్రదేశ్ లో టూరిస్టులను కర్రతో ‘చెక్’ చేస్తున్న చిన్నారి బాలుడు

| Edited By: Phani CH

Jul 07, 2021 | 11:40 AM

దేశవ్యాప్తంగా కోవిద్ ఆంక్షలను ప్రభుత్వం మెల్లగా ఎత్తివేస్తుండడంతో వందలాది టూరిస్టులు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వంటి హిల్ స్టేషన్లకు పోటెత్తుతున్నారు

Himachal Pradesh: మీ మాస్క్ ఏదీ..? హిమాచల్ ప్రదేశ్ లో టూరిస్టులను కర్రతో చెక్ చేస్తున్న చిన్నారి బాలుడు
Himachal Pradesh
Follow us on

దేశవ్యాప్తంగా కోవిద్ ఆంక్షలను ప్రభుత్వం మెల్లగా ఎత్తివేస్తుండడంతో వందలాది టూరిస్టులు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వంటి హిల్ స్టేషన్లకు పోటెత్తుతున్నారు. సిమ్లా మళ్ళీ పర్యాటకులతో కళకళలాడుతోంది. అయితే చాలామంది మాస్కులు ధరించకుండా కోవిద్ ప్రొటొకాల్స్ పాటించకుండా ఈ టూరిస్ట్ ప్రదేశాలను విజిట్ చేస్తున్నారు. ఇది గమనించినట్టున్నాడు. ధర్మశాలలో ఓ చిన్న కుర్రాడు చేతబట్టుకుని.. ‘మీ మాస్క్ ఏదీ’ అంటూ వారిని ప్రశ్నిస్తున్న వైనం వీడియోకెక్కింది. కాళ్లకు చెప్పులు కూడా లేని ఈ చిన్నారి మాస్కుల పట్ల వారిలో అవగాహన తేవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇతడిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కొంతమంది ఈ పేద బాలుడిని చూసి జాలి పడితే మరికొందరు విసుక్కున్నారు. ఓ వ్యక్తి అతని చేతిలోని కర్రను లాక్కోవడానికి ప్రయత్నించాడు. కేవలం నిమిషం నిడివి గల ఈ వీడియోలో సుమారు 30 మందికి పైగా టూరిస్టులు మాస్క్ లేకుండా కనిపించారు. హిల్ స్టేషన్లు, మార్కెట్లలో తప్పనిసరిగా కోవిద్ రూల్స్ పాటించాలని ప్రభుత్వం పదేపపదే చెబుతోంది.

లేని పక్షంలో మళ్ళీ కోవిద్ మహమ్మారి విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. నిన్న ఈ హిల్ స్టేషన్లతో బాటు ముంబై, ఢిల్లీ వంటి నగరాల మార్కెట్లలో గుంపులు గుంపులుగా ఉన్న జనాలను చూసి ఆ ఫ్జోటోలను షేర్ చేసిన ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ ‘భయపడినంత’ పని చేశారు. ఇలా అయితే ఆంక్షలను తిరిగి విధించాల్సి వస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా వ్యాఖ్యానించారు. ఓ వైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. అయినా ప్రజలు మళ్ళీ నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలతో వీడియోలు.. పాపులర్ యూట్యూబర్‌పై పీడీ యాక్ట్

Mysterious Village: భూమిపైనే అల్లంత దూరాన మేఘాల్లో గ్రామం.. వర్షం చుక్క ఎరుగని ఊరు.. ఇదెక్కడంటే..!?