AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Court: అద్దె ఇంట్లో వ్యభిచారం.. యజమానులపై హైకోర్టు సంచలన తీర్పు..

బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి అద్దెకు ఇచ్చిన ఇంట్లో వ్యభిచార గృహాన్ని నడిపారు. అందుకుగాను వారికి అనుమతి ఇచ్చిన ఇంటి యాజమానిపై కేసు ఫైల్ చేశారు. కోర్టు దీనిపై సంచలన తీర్పు వెలువరించింది. అద్దెదారులు ఆ గృహాన్ని వినియోగించుకున్నందుకు ఇంటి యాజమానిపై అనైతిక, లైంగిక నేరాల కింద కేసు నమోదు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

High Court: అద్దె ఇంట్లో వ్యభిచారం.. యజమానులపై హైకోర్టు సంచలన తీర్పు..
Bombay High Court
Srikar T
|

Updated on: Jan 24, 2024 | 12:18 PM

Share

ముంబాయి, జనవరి 24: బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి అద్దెకు ఇచ్చిన ఇంట్లో వ్యభిచార గృహాన్ని నడిపారు. అందుకుగాను వారికి అనుమతి ఇచ్చిన ఇంటి యాజమానిపై కేసు ఫైల్ చేశారు. కోర్టు దీనిపై సంచలన తీర్పు వెలువరించింది. అద్దెదారులు ఆ గృహాన్ని వినియోగించుకున్నందుకు ఇంటి యాజమానిపై అనైతిక, లైంగిక నేరాల కింద కేసు నమోదు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అద్దెదారులకు, ఇంటి యాజమానికి మధ్య ఉన్న లీజ్ ఒప్పందంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలో భూస్వామి విఫలమైనట్లు పేర్కొంది. అంతమాత్రాన ఇంటి ఓనర్‎ను ఇందులో నిందితుడిగా చేర్చలేమని చెప్పింది. 2019లో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారన్న ఆరోపణలపై ఒక జంటను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో బిల్డింగ్ యాజమానిపై కూడా పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. అయితే జనవరి 17న దీనిపై జస్టిస్ ఎంఎస్ కార్నిక్, మహేష్ అంధలేను విడుదల చేస్తూ సంచలన తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

2019లో బీరెన్ అతని భార్య 16ఏళ్ల బంగ్లాదేశ్ అమ్మాయిని అక్రమంగా రవాణా చేశారు. అద్దెకు తీసుకున్న అంధలే నివాసంలో వ్యభిచార గృహాన్ని నడిపించేవాడని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి అంధలే ఇంటి యాజమానితో 11 నెలల ఇంటి అగ్రమెంట్ కూడా చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే కొంత కాలం తరువాత బీరెన్ అద్దె చెల్లింపుల్లో కాస్త జాప్యం చేశారు. యాజమాని కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశారు. ఇదే క్రమంలో అంధలే ఇంటిని కొందరు యువకులు తరచూ వస్తూ పోతూ ఉంటారని అతనికి సమాచారం ఇచ్చారు. ఇదే క్రమంలో ప్రభుత్వ తరఫు న్యాయవాది.. పిటిషనర్ తరఫు న్యాయవాది ఏఆర్ పాటిల్ వాదనలను వ్యతిరేకించారు. ఇంటిని తీసుకున్నప్పటి నుంచి అంధలేకు సమాన బాధ్యత ఉంటుందని వాదించారు. అక్కడి పరిస్థితులను పోలీసులకు చెప్పడంలో విఫలమయ్యారు మహేష్ అంధలే అని జడ్జికి చెప్పారు. ఆ ప్రాంగణాన్ని వ్యభిచార గృహంగా ఉపయోగించడంపై అంధలేకు ఏమీ చేయలేమని స్పష్టం చేసింది. పైగా యువతి వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారని.. ఇది ఇంటి యాజమానిపై ప్రభావం చూపదని తెలిపారు యువతి తరఫు న్యాయవాది హృషికేష్ షిండే. దీంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై