Varavara rao: భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు బెయిల్ గడువును బాంబే హైకోర్టు పొడిగించింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చిన వరవరరావు.. తన బెయిల్ గడువును పొడగించాలంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఆయన బెయిల్‌ను పొడిగించింది. ముందున్న ఉత్తర్వుల ప్రకారం.. నవంబర్ 18 వరకు లొంగిపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో తన స్వస్థలమైన హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ అంశాన్ని వాయిదా వేసింది. హైదరాబాద్ తరలింపునకు సంబంధించి ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
మరోవైపు.. వరవరరావు ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన్ను హైదరాబాద్ తరలించే అవసరం లేదని హైకోర్టుకు ఎన్ఐఏ వివరించింది. కాగా, భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు.. కొన్ని నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఆయనకు బెయిల్ మంజూరైంది. బాంబే హైకోర్టు ఫిబ్రవరి 22వ తేదీన షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, ఇప్పటి వరకు వరవరరావు బెయిల్‌ను రెండుసార్లు పొడిగించ కోర్టు.. ఇప్పుడు మూడోసారి కూడా పొడిగించింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
Also read:
Hair Care: ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలిపోతుందా..? అయితే ఈ హోం రెమెడీస్ మీ కోసమే..