‘కేరళ, జమ్మూ కాశ్మీర్ ‘డోర్-టు డోర్-వ్యాక్సిన్ పాలసీ చూడండి’….కేంద్రానికి బాంబేహైకోర్టు ‘మొట్టికాయ’ !

| Edited By: Phani CH

Jun 12, 2021 | 4:45 PM

కేరళ, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు పాటిస్తున్న 'డోర్-టు'డోర్' వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని బాంబే హైకోర్టు కేంద్రానికి సూచించింది. అవి ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తుండగా..

కేరళ, జమ్మూ కాశ్మీర్ డోర్-టు డోర్-వ్యాక్సిన్ పాలసీ  చూడండి....కేంద్రానికి బాంబేహైకోర్టు మొట్టికాయ !
Bombay High Court
Follow us on

కేరళ, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు పాటిస్తున్న ‘డోర్-టు’డోర్’ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని బాంబే హైకోర్టు కేంద్రానికి సూచించింది. అవి ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తుండగా.. మీరు మాత్రం..రాష్ట్రాల్లో ఈ పద్దతి సాధ్యం కాదని చెబుతున్నారని కోర్టు దాదాపు ‘మొట్టికాయ’ వేసింది. ఈ విధమైన పాలసీని పాటించేందుకు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వస్తోందని చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జి.ఎన్.కులకర్ణి లతో కూడిన బెంచ్ కేంద్రాన్ని ప్రశ్నించింది. ధృతి కపాడియా, కునాల్ తివారీ అనే అడ్వొకేట్లు దాఖలు చేసిన పిల్ పై విచారణ సందర్బంగా కోర్టు ఇలా తీవ్రంగా స్పందించింది. ఆ లాయర్లు …తమ పిల్ లో ఈ ప్రత్యేక ‘పాలసీ’ గురించి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. దీనిపై కోర్టు దాదాపు వీరి వాదనతో ఏకీభవిస్తూ..ఈ విషయంలో మీకు వచ్చిన సమస్య ఏమిటో అర్థం కావడం లేదని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ విధమైన కార్యక్రమాన్నితామూ చేపడతామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని లాయర్లు ప్రస్తావించారు.దీంతో… కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదించి తగిన ఆదేశాలు అందుకోవాలని, ఈ విధమైన కారక్రమం అమలులో స సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోర్టు…. అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కి సూచించింది.

ఈ నెల 14 న ఈ పిల్ పై మళ్ళీ విచారణ జరగాలని బెంచ్ నిర్ణయించింది. ఇటీవల కేంద్ర వ్యాక్సినేషన్ పాలసీపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడడంతో.. దాన్ని మారుస్తున్నట్టు ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్న సంగతి గమనార్హం.

 

మరిన్ని ఇక్కడ చూడండి:  Bhojeshwar Temple: అనేక రహస్యాలు నెలవు ఈ శివాలయం తల్లికోసం పాండవులు ఒక్కరాత్రిలో నిర్మించినట్లు పురాణాల కథనం

Shikhar Dhawan Coments : జాతీయ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం..! శిఖర్ ధావన్ ఆనంద క్షణాలు..