Kangana Ranaut: సెలెబ్రిటీ అయితేనేం.. ఆమె ఓ కేసులో నిందితురాలు.. కంగనాకు కోర్టులో చుక్కెదురు

|

Mar 25, 2022 | 11:21 AM

కంగనా రనౌత్ సెలెబ్రిటీనే కావొచ్చు. కానీ ఆమె ఒక కేసులో నిందితురాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ముంబయిలోని స్థానిక న్యాయస్థానం(Mumbai Court) వ్యాఖ్యానించింది. కోర్టులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు...

Kangana Ranaut: సెలెబ్రిటీ అయితేనేం.. ఆమె ఓ కేసులో నిందితురాలు.. కంగనాకు కోర్టులో చుక్కెదురు
Bombay
Follow us on

కంగనా రనౌత్ సెలెబ్రిటీనే కావొచ్చు. కానీ ఆమె ఒక కేసులో నిందితురాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ముంబయిలోని స్థానిక న్యాయస్థానం(Mumbai Court) వ్యాఖ్యానించింది. కోర్టులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను(Petetion) కోర్టు తిరస్కరించింది. కంగనా రనౌత్‌ సెలబ్రిటీనే కావొచ్చన్న కోర్టు.. ఆమె నిందితురాలు కాబట్టి న్యాయస్థానం నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. బాలీవుడ్‌ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు సహకరించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో కంగనా రనౌత్‌(Kangana Ranaut) తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మెట్రోపాలిటన్‌ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కంగనా రనౌత్‌పై బాలీవుడ్‌ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ ఆరోపించారు. దీంతో తన పరువుకు భంగం కలిగిందంటూ 2020 నవంబర్‌లో ఆయన స్థానిక న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటి నుంచి కేసు విచారణకు కంగనా రనౌత్‌ హాజరవడం లేదు.

తాను హిందీ సినిమా ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్లలో ఒకరినని వృత్తిపరంగా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటూ వ్యక్తిగత హాజరుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే కంగనా అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఆమె వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉండవచ్చు.. కానీ, ఆమె ఓ కేసులో నిందితురాలనే విషయాన్ని మరచిపోవద్దని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆర్‌ఆర్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా, తనకు ఇష్టం వచ్చిన పద్ధతిలో నిందితురాలు వ్యవహరిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా వ్యక్తిగత హాజరుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరడం హక్కు కాదనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించింది. బెయిల్‌ బాండ్‌ కోసం చట్టపరంగా ఉన్న నియమ నిబంధనలను పాటించాలని ఆదేశించింది.

Also Read

Mysore: అన్న మరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న తమ్ముడు.. ఏకంగా 24 ఏళ్ల పాటు..

Kurnool CI corruption: బరితెగించిన కర్నూలు సీఐ.. ఎస్పీ పేరుతో రూ.15 లక్షలు హాంఫట్‌.. గుట్టు రట్టవడంతో…

Viral Video: అచ్చం మనుషుల్లానే.. బెలూన్‌తో వాలీబాల్‌ ఆడిన శునకాలు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..