Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో నడిచిన బాలీవుడ్ నటి స్వరా భాస్కర్..

|

Dec 01, 2022 | 1:25 PM

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో గురువారం సినీ నటి స్వర భాస్కర్‌ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె రాహుల్ గాంధీతో కలిసి మాట్లాడుతూ...

1 / 8
కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో గురువారం సినీ నటి స్వర భాస్కర్‌ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె రాహుల్ గాంధీతో కలిసి మాట్లాడుతూ కొంతదూరం నడిచారు.

2 / 8
రాహుల్ గాంధీతో స్వరా భాస్కర్ కలిసి చాలా సేపు కనిపించారు. వివాదాలకు దగ్గరగా ఉండే స్వరా ఇప్పుడు భారత్ జోడో యాత్రలో చేరడం ద్వారా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది.

3 / 8
అంతకుముందు రోజు(బుధవారం) ఇండోర్ విమానాశ్రయంలో స్వర భాస్కర్‌కు కాంగ్రెస్‌ నేత సత్యనారాయణ పటేల్‌ స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

4 / 8
సత్యనారాయణ పటేల్  తన పోస్ట్‌లో ‘‘దేశ ఐక్యత, సమానత్వం, గౌరవం కోసం పోరాడటానికి సిద్ధమైన రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడానికి ప్రముఖ నటి స్వరా భాస్కర్ జీ ఈ రోజు ఇండోర్ చేరుకున్నారు. రేపు ఉదయం జెండా ఎగురవేయడంతో పాటు, రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు’’ అని కాప్షన్ రాశారు.

5 / 8
ఒకరోజు విరామం తర్వాత భారత్ జోడో యాత్ర గురువారం ఉదయం ఉజ్జయిని నుంచి ప్రారంభమై మధ్యప్రదేశ్ చివరి జిల్లా అగర్ మాల్వా వైపు సాగింది.

6 / 8
గురువారం యాత్రలో స్వర భాస్కర్‌తో పాటు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ ఎంపీ ప్రేమ్‌చంద్ గుడ్డు, అఖిల భారత మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు శోభా ఓజా కూడా పాల్గొన్నారు.

7 / 8
ఉజ్జయిని శివార్లలో ఉన్న ఆర్‌డీ గార్డి మెడికల్ కాలేజీ నుంచి ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం ఘటియా బస్టాండ్ నుంచి యాత్ర ప్రారంభమై రాత్రికి ఝల్రా గ్రామంలో ఆగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

8 / 8
స్వర భాస్కర్ కంటే ముందు, పూజా భట్, సుశాంత్ సింగ్, రష్మీ దేశాయ్ ఇంకా అమోల్ పాలేకర్ వంటి చాలా మంది తారలు.. కాంగ్రెస్ అగ్రనేత చేపట్టిన ఈ జోడో యాత్రలో పాల్గొన్నారు.