Boeing Share: ఆది నుంచీ వివాదాల్లో బోయింగ్.. తాజా ప్రమాదంతో కుప్పకూలిన షేర్ విలువ!

గుజరాత్‌లోని భారీ విమాన ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమాన భద్రత, నాణ్యత లోపాలు కూడా ప్రమాదానికి కారణం కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ బోయింగ్‌ విమానాలలో ఫ్యూజ్‌లేజ్ షిమ్మింగ్, స్కిన్ సర్పేసింగ్ సమస్యలుంటున్నాయని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దీంతో తాజాగా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ప్రమాదానికి గురికావడంతో దాని భద్రత, నాణ్యత, నియంత్రణ సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

Boeing Share: ఆది నుంచీ వివాదాల్లో బోయింగ్.. తాజా ప్రమాదంతో కుప్పకూలిన షేర్ విలువ!
Boeing Share

Updated on: Jun 12, 2025 | 6:09 PM

అమెరికాకు చెందిన ఈ బోయింగ్ కంపెనీ 2011లో వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ కంపెనీ మూడు వేరియంట్లు 787-8, 787-9, 787-10 విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ బోయింగ్ విమానాలలో ఫ్యూజ్‌లేజ్ షిమ్మింగ్, స్కిన్ సర్పేసింగ్ సమస్యలున్నాయంటూ.. గతం నుంచీ పలువురు ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు విజిల్‌బ్లోయర్లు బోయింగ్ సంస్థ నాణ్యత విషయంలో రాజీపడటమే గాక పలు అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. వారిలో కొందరు విమానాల తయారీలో బోయింగ్ అనుసరిస్తున్న షార్ట్‌కట్స్‌‌ల మూలంగానే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ వైఫల్యాలపై పలు మార్చు హెచ్చరించినట్టు తెలుస్తోంది.

అయితే ఈ బోయింగ్‌ కంపెనీ 787 విమానాల తయారీలో విమాన నిర్మాణాన్ని ప్రభావితం చేసే ఏరోస్పేస్-గ్రేడ్ టైటానియం మిశ్రమానికి బదులుగా.. స్టాండర్డ్ టైటానియం వంటి పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఎఫ్ఏఏ గుర్తించింది. దీంతో 2020లో బోయింగ్ కంపెనీ తయారు చేసిన అనేక 787 విమానాలను ఫ్యూజ్‌లేజ్ షిమ్మింగ్ స్కిన్ సర్ఫేసింగ్‌తో సహా నాణ్యత నియంత్రణల సమస్యల కారణంగా గ్రౌండింగ్ (వెనక్కి పిలిపించటం) చేసినట్టు తెలుస్తోంది. అయితే, గతంలోనూ ఈ కంపెనీ తయారు చేసిన విమానాలు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలోనూ ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానాన్ని బోయింగ్ కంపెనీనే తయారు చేసింది. దీంతో ఈ బోయింగ్‌ కంపెనీపై నమ్మకం కోల్పోయిన ఇన్వెస్టర్ల షేర్లను అమ్మేయడం స్టార్ట్ చేశారు. దీంతో గురువారం ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో ఈ బోయింగ్ కంపెనీ షేర్లు 7.67 శాతం పడిపోయాయి. గత మూడు నెలల్లో బోయింగ్ షేర్లు 24 శాతం పెరిగి నష్టాల నుంచి రికవరీ సాధించినప్పటికీ, ఇప్పుడు వరుసగా మూడో రోజు ఈ క్షీణత కొనసాగుతోంది. విమానాల భద్రతా, నాణ్యత లోపాలపై ఇప్పటికే సవాళ్లను ఎదుర్కొంటున్న బోయింగ్ కంపెనీకి ఇది మరో ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..