విమాన ప్రమాదం.. శిఖా గార్గ్‌ కుటుంబానికి రూ.317 కోట్ల పరిహారం! కోర్టు సంచలన తీర్పు..

2019 ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 MAX ప్రమాదంలో శిఖా గార్గ్ మరణించిన ఘటనలో, ఆమె భారతీయ కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 317 కోట్లు) పరిహారంగా చెల్లించాలని చికాగో కోర్టు బోయింగ్‌ను ఆదేశించింది. ఆరేళ్ల న్యాయ పోరాటం తర్వాత ఈ తీర్పు వచ్చింది.

విమాన ప్రమాదం.. శిఖా గార్గ్‌ కుటుంబానికి రూ.317 కోట్ల పరిహారం! కోర్టు సంచలన తీర్పు..
Shikha Garg

Edited By: SN Pasha

Updated on: Nov 15, 2025 | 9:27 PM

బోయింగ్ విమాన ప్రమాద ఘటనలో మరణించిన ఒక భారతీయ కుటుంబానికి రూ.317 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2019లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 మాక్స్ విమానం ప్రమాదానికి గురికాగా ఈ ప్రమాదంలో భారతీయ పౌరురాలైన శిఖా గార్గ్ మరణించారు. ఐక్యరాజ్యసమితిలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్న శిఖ గార్గ్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సులో పాల్గొనేందుకు నైరోబి కి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇథియోపియా లోని బోలే అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొన్ని నిమిషాలకే ఆ విమానం కుప్ప కూలిపోవడంతో ఈ ప్రమాదంలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

విమాన కంపెనీపై దావా..

ఆ తర్వాత బోయింగ్ ఈ కేసులలో చాలా వరకు పరిహారం అందించి పరిష్కరించింది. అయితే శిఖ గార్గ్ ఐక్యరాజ్యసమితిలో కన్సల్టెంట్ గా పనిచేయడం, ఆ విమాన ప్రమాదం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోవడం తదితర అంశాలతో పాటు, విమాన డిజైన్ లో లోపాలు ఉన్నాయని, ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడం లో బోయింగ్ విఫలమైందని ఆరోపిస్తూ శిఖ గార్గ్ కుటుంబం కోర్టులో దావా వేసింది.

శిఖా కుటుంబానికి అనుకూలంగా తీర్పు

ఈ క్రమంలోనే చికాగోలోని ఫెడరల్ జ్యూరీ ఈ వారంలో శిఖ కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. పరిహారంతో పాటు ఇప్పటివరకు ఆయన ఖర్చులను కూడా కలిపి ఇవ్వాలని 35.85 మిలియన్ డాలర్లను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆరేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత శిఖ కుటుంబానికి ఈ విజయం లభించింది.

భారతీయ సాంప్రదాయాలను ఎక్కువగా ఇష్టపడే శిఖ గార్గ్ ఐక్యరాజ్యసమితి కన్సల్టెంట్ గా పనిచేయడంతో పాటు ఆమె మరణించిన సమయంలో పీహెచ్డీ కూడా చేస్తున్నారు. చీర కట్టుకునే ఎక్కువగా ఇష్టపడే శిఖ గార్గ్ ప్రమాదం జరిగిన రోజు చీరకట్టులోనే విమానాన్ని ఎక్కారని, ఆ తర్వాత తిరిగిరాని లోకాలకు చేరిపోయారని వారి కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా తీర్పు ఆమె కుటుంబానికి కాస్త ఉపశమనం అని చెప్పాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి