అదృశ్యమైన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం లభ్యం..

|

Oct 07, 2024 | 6:25 PM

ఆదివారం తెల్లవారుజామున కారులో ఇంటి నుంచి బయలుదేరిన అలీ తిరిగి రాకపోవడం, ఉదయం కులూర్‌ వంతెనపై కారు పార్క్‌ చేసి ఉండటంతో ముంతాజ్‌ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళూరు లైన్ అండ్ మెరైన్ ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తున్న ముంతాజ్ అలీ..

అదృశ్యమైన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం లభ్యం..
Mumtaz Ali
Follow us on

కర్ణాటకలోని మంగళూరు నియోజకవర్గంలో కనిపించకుండా పోయిన వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం మంగళూరులో లభ్యమైంది. సోమవారం ఉదయం కుల్లూరు వంతెన సమీపంలోని ఫల్గుణి నదిలో మృతదేహాన్ని వెలికితీశారు. షిరూర్ విపత్తులో మరణించిన అర్జున్ కోసం అన్వేషణలో పాల్గొన్న డైవర్ ఈశ్వర్ మల్పేతో సహా రెస్క్యూటీ, జాతీయ విపత్తు నిర్వహణ బృందం ముంతాజ్‌ అలీ కోసం ఫాల్గుణి నదిలో గాలించగా మృతదేహాం లభించింది. ముంతాజ్‌ అలీ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు ఆదివారం ఉదయం కుళ్లూరు వంతెన సమీపంలో దెబ్బతిని కనిపించింది. ఆదివారం తెల్లవారుజామున కారులో ఇంటి నుంచి బయలుదేరిన అలీ తిరిగి రాకపోవడం, ఉదయం కులూర్‌ వంతెనపై కారు పార్క్‌ చేసి ఉండటంతో
ముంతాజ్‌ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంగళూరు లైన్ అండ్ మెరైన్ ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తున్న ముంతాజ్ అలీ ఆదివారం (అక్టోబర్ 6) తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూప్‌కు వాయిస్ మెసేజ్ పంపారు. అతని కుమార్తె 4:40 AM సమయంలో ఆ మెసేజ్‌ చూశారు. వెంటనే అతనికి కాల్‌ చేయగా సమాధానం రాలేదని తెలిసింది. అతని కోసం గాలించిగా, అతని కారు కులూర్ వంతెన వద్ద గుర్తించారు. అయితే, అలీ ఆ కారులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆదివారం తెల్లవారుజామున అదృశ్యమైన వ్యాపారవేత్త బీఎం ముంతాజ్ అలీ (52) మృతదేహం కూలూర్ వంతెన సమీపంలోని ఫల్గుణి నదిలో సోమవారం ఉదయం లభ్యమైంది. మృతదేహాన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 52 ఏళ్ల ముంతాజ్ అలీ మంగళూరు నార్త్ మాజీ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బావా సోదరుడు. ముంతాజ్ అలీని కొందరు బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం. ముంతాజ్ అలీ మృతికి కారణంగా ఆరోపిస్తూ  ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. అతడి నుంచి ఓ మహిళ సహా ఆరుగురు వ్యక్తులు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..