Viksit Bharat Fellowship: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తయిన సందర్భంగా.. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కేంద్రమంత్రులు, పలువురు రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.. సెప్టెంబర్ 17న (మంగళవారం) ప్రధాని మోడీ 74వ పుట్టినరోజు సందర్భంగా బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ కొత్త పబ్లిషింగ్ అండ్ నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు.. ‘వికసిత్ భారత్ ఫెలోషిప్’ని ప్రకటించింది. ప్రచురణలతోపాటు.. ఏటా 25 ఫెలోషిప్‌లను అందించనున్నట్లు బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ CEO అఖిలేష్ మిశ్రా ప్రకటించారు.
బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులు, నిపుణులు, విద్యావేత్తల కోసం 25 ఫెలోషిప్‌లను అందించనుంది.. ఈ ఫెలోషిప్‌లు నాన్ ఫిక్షన్ పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు, పిల్లల సాహిత్యం, సామాజిక ఇతివృత్తాలు, విలువలపై కాఫీ టేబుల్ పుస్తకాల ద్వారా భారతదేశం గురించి అర్ధవంతమైన కథనాన్ని తెలియజేస్తాయని ఫౌండేషన్ తెలిపింది. ఈ కార్యక్రమం లక్ష్యం ప్రతిభావంతులు, విద్యావేత్తలు, నిపుణులను ప్రోత్సహించడం..
బ్లూక్రాఫ్ట్ ఫౌండేషన్ ప్రకారం.. వికసిత్ భారత్ ఫెలోషిప్ మూడు-స్థాయిలను కలిగిఉంటుంది. ఇందులో బ్లూక్రాఫ్ట్ అసోసియేట్ ఫెలోషిప్, బ్లూక్రాఫ్ట్ సీనియర్ ఫెలోషిప్, బ్లూక్రాఫ్ట్ ఎక్స్‌క్లూజివ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఈ మూడు ఫెలోషిప్‌లకు వేర్వేరుగా నెలవారీ స్కాలర్‌షిప్‌లను నిర్ణయిస్తారు. అసోసియేట్ ఫెలోలకు రూ.75 వేలు, సీనియర్ ఫెలోలకు రూ.1 లక్షా 25 వేలు, బ్లూక్రాఫ్ట్ విశిష్ట సభ్యులకు రూ.2 లక్షల చొప్పున నెలవారీ స్కాలర్‌షిప్‌లను అందజేస్తారు. అంతేకాకుండా వారికి మెరుగైన సౌకర్యాలు అందుతాయి. ఎంపికైన వారందరికీ అనుభవజ్ఞులైన సబ్జెక్ట్ నిపుణులతో పాటు ప్రఖ్యాత నిపుణులు, గైడ్ లతో సంభాషించే అవకాశాన్ని కూడా పొందుతారు. ఇది వారి పని, పరిశోధనా రచనలను మరింత మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. సభ్యులు చేసిన పరిశోధన, పనిని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచురించాల్సి ఉంటుంది.
బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ CEO అఖిలేష్ మిశ్రా మాట్లాడుతూ.. వికాసిత్ భారత్ ఫెలోషిప్ చారిత్రాత్మకమైనదన్నారు. దీని భాగస్వామ్యం ద్వారా ప్రధాని మోదీ అవలంబించిన వృద్ధి, సమ్మిళితత పురోగతి, ఆయన విధానాలను, దార్శనికతను ప్రతిబింభించడానికి తమ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. దీనిని ప్రారంభించడానికి ( ప్రధాని మోదీ పుట్టిరోజు ) ఇంతకంటే మంచి సమయం ఏముంటుందంటూ పేర్కొన్నారు.
On the occasion of PM Narendra Modi ji’s Birthday, @BlueKraft is delighted to announce the following:
Viksit Bharat Fellowship Programme to encourage writing & creative talent across various domains. BlueKraft also launches its publication division.https://t.co/5MxsX1mPsj
1/3— Akhilesh Mishra (@amishra77) September 17, 2024
“ఫెలోస్ పరిశోధన, రచన కోసం ప్రత్యేకమైన వనరులతో పాటు వారి పనిని మెరుగుపరచగల చర్చలు.. అంతర్దృష్టులను సులభతరం చేయడానికి అనుభవజ్ఞులైన సబ్జెక్ట్ నిపుణులు, ప్రఖ్యాత నిపుణులు.. ఆలోచనా నాయకులతో మార్గదర్శకత్వం.. అవకాశాలకు ప్రత్యేక ప్రేరణను పొందుతారు..
పబ్లిషింగ్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధునిక, అభివృద్ధి చెందుతున్న భారతదేశం.. ఆకాంక్షలు, వికసిత్ భారత్ ప్రధాన మంత్రి దార్శనికతను ప్రతిధ్వనించే అధిక-నాణ్యత ప్రచురణలను రూపొందించడానికి ఒక నిబద్ధత..’’ అంటూ బ్లూక్రాఫ్ట్ తెలిపింది.
బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్.. వికసిత్ భారత్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ పొందడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను నవంబర్ 1, 2024 వరకు సమర్పించవచ్చు. దీనికి సంబంధించిన వివరణాత్మక సమాచారం, దరఖాస్తు ఫారమ్‌లు ఫౌండేషన్ వెబ్‌సైట్ www.bluekraft.in/fellowship లో అందుబాటులో ఉంటాయి .
బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ డైరెక్టర్ హితేష్ జైన్ మాట్లాడుతూ.. ఆలోచనాత్మక ప్రచురణలు.. జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా, దేశంలో సామాజిక అభివృద్ధి గురించి జరుగుతున్న సంభాషణకు గణనీయమైన సహకారం అందించగలమని తాము విశ్వసిస్తున్నామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..