ఓటరు జాబితా సవరణలో మరో వివాదం.. ఆందోళన కలిగిస్తోన్న BLOల వరుస మరణాలు!

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్న 16 మంది సిబ్బంది మృతి చెందడం చర్చనీయాంశం అవుతోంది. మూడు వారాల్లోనే 16 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు మరణించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇంతకీ.. బూత్ లెవెల్ ఆఫీసర్ల మృతికి కారణాలేంటి..? ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏం జరుగుతోంది..?

ఓటరు జాబితా సవరణలో మరో వివాదం.. ఆందోళన కలిగిస్తోన్న BLOల వరుస మరణాలు!
Ceo Gyanesh Kumar With Ecs Sukhbir Singh Sandhu, And Vivek Joshi

Updated on: Nov 26, 2025 | 7:54 PM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న కొన్ని రాష్ట్రాల్లో బూత్‌ స్థాయి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పనిఒత్తిడి కారణంగా బీఎల్‌ఓలు అనారోగ్యానికి గురవడం, రాజీనామాలు చేస్తుండటం, పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కలవరం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే.. కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. తాజా పరిణామాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల సీఈఓల నుంచి నివేదిక కోరారు.

బీఎల్‌ఓల అంశంపై సీఈఓలు దృష్టి సారించారని.. తాజా పరిణామాలపై సంబంధిత జిల్లాల ఎన్నికల అధికారుల నుంచి రిపోర్ట్‌లు కోరుతున్నారని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాత ఎన్నికల సంఘానికి పూర్తి నివేదిక అందిస్తారని.. మొత్తం వ్యవహారాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే.. బీఎల్‌ఓలకు అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం అధికారులు హామీ ఇచ్చారు.

వాస్తవానికి.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బందికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు చనిపోవడం, మరికొందరు ఆత్మహత్యలు చేసుకోడం, ఇంకొందరు ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్న ఘటనలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. గత 3 వారాల్లోనే 16 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు మృతి చెందారనే ప్రచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..