Clotting Cases: భారత్‌లో స్వల్పంగా కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావం.. అలాంటివి 26 కేసులు మాత్రమే..

|

May 17, 2021 | 7:11 PM

Bleeding Clotting Cases: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న అనంతరం అతి స్వల్పస్థాయిలో రక్తస్రావం, రక్తం గడ్డుకున్న...

Clotting Cases: భారత్‌లో స్వల్పంగా కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావం.. అలాంటివి 26 కేసులు మాత్రమే..
Covid Vaccination
Follow us on

Bleeding Clotting Cases: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న అనంతరం అతి స్వల్పస్థాయిలో రక్తస్రావం, రక్తం గడ్డుకున్న ఘటనలు నమోదైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోవిషీల్డ్ డోసుల తర్వాత ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై తాజాగా నేషనల్ అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ కమిటీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఓ నివేదికను సమర్పించింది. మొత్తం 498 సీరియస్ కేసులను విశ్లేషించిన కమిటీ, అందులో 26 కేసుల్లో రక్తం గడ్డకట్టినట్టు గుర్తించారు. ఇలాంటి ఘటనలేవీ కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలో నమోదు కాలేదని కమిటీ స్పష్టం చేసింది.

నేషనల్ అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ కమిటీ(AEFI) చూపించిన గణాంకాల ప్రకారం, రక్తం గడ్డకట్టిన ఘటనలు ఇండియాలో తక్కువే అయినప్పటికీ.. ఖచ్చితమైన ప్రమాదం ఉందని తెలుస్తోంది. దేశంలో 10 లక్షల డోసులకు గాను 0.61 కేసుల్లోనే దుష్పరిణామాలు ఎదురయినట్టు తన నివేదికలో పేర్కొంది. ఇది యూకే రెగ్యులేటర్ మెడికల్ అండ్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (MHRA) నివేదించిన 4 కేసులు / మిలియన్ల కంటే చాలా తక్కువ. జర్మనీ మిలియన్ మోతాదుకు 10 సంఘటనలను నివేదించింది. యూరోపియన్ సంతతికి చెందిన వారితో పోల్చితే దక్షిణ, ఆగ్నేయ ఆసియా సంతతికి చెందిన వారిలో ఈ ప్రమాదం దాదాపు 70 శాతం తక్కువగా ఉందని సమాచారం.

ఏదైనా కోవిడ్ వ్యాక్సిన్ (ముఖ్యంగా కోవిషీల్డ్) అందుకున్న 20 రోజులలోపు సంభవించే రక్తం గడ్డకట్టడం అంశాలను తెలుసుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. హెల్త్‌కేర్ వర్కర్స్, వ్యాక్సిన్ లబ్ధిదారులలో వ్యాక్సిన్‌ భయాలను తొలగించాలని అధికారులకు తెలిపింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కండరాలు, గుండెల్లో నొప్పి, చర్మంపై దద్దుర్లు, కడుపునొప్పి, తలనొప్పి వంటి లక్షణాలను పరిశీలించాలని తెలిపింది. అటు ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా.. కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని తెలిపిన విషయం విదితమే.