Indian Air Force : కూలిపోయిన యుద్ధ విమానం.. కీలకమైన బ్లాక్‌బాక్స్ లభ్యం..

భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్‌-2000, సుఖోయ్‌-30 యుద్ధ విమానాల బ్లాక్‌ బాక్స్‌ను శనివారం స్వాధీనం చేసుకున్నారు. దీంతో బ్లాక్‌బాక్స్‌ విశ్లేషణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు.

Indian Air Force : కూలిపోయిన యుద్ధ విమానం.. కీలకమైన బ్లాక్‌బాక్స్ లభ్యం..
Black Box

Updated on: Jan 30, 2023 | 11:40 AM

శనివారం కూలిపోయిన భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్-2000, సుఖోయ్-30 యుద్ధ విమానాల బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దీంతో బ్లాక్‌బాక్స్‌ విశ్లేషణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలోని పహద్‌గఢ్‌లో 2 విమానాలు కూలిపోయాయి. అవశేషాలను గుర్తించడానికి చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. పహాడ్‌ఘర్‌లో మిరాజ్ బ్లాక్ బాక్స్‌ను గుర్తించారు అధికారులు.

అదే స్థలంలో సుఖోయ్ డేటా రికార్డర్‌లో కొంత భాగం లభించిందని, రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మరిన్ని శిధిలాలు పడిపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు. పోలీసులు, ఎయిర్ ఫోర్స్, ఇతర అధికారులు సుఖోయ్ విమానం బ్లాక్ బాక్స్‌లోని ఇతర భాగాల కోసం వెతుకుతున్నారు.

శనివారం జరిగిన ఈ ప్రమాదంలో బెల్గాంకు చెందిన వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి మరణించగా, ఇద్దరు సుఖోయ్ పైలట్లు విమానం నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..