Rammohan Naidu: బ్లాక్‌బాక్స్‌ ఇండియాలోనే ఉంది.. విదేశాలకు తరలించామన్నది అవాస్తవం- కేంద్రమంత్రి

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఉపయోగపడే ఫ్లైట్‌లోని బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు తీసుకెళ్లి విచారణ జరుపుతారని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. బ్లాక్‌ బాక్స్‌పై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బ్లాక్ బాక్స్ ఇండియాలోనే ఉందని.. ఇక్కడే దానిపై పరిశోదన జరుగుతుందన్నారు.

Rammohan Naidu: బ్లాక్‌బాక్స్‌ ఇండియాలోనే ఉంది.. విదేశాలకు తరలించామన్నది అవాస్తవం- కేంద్రమంత్రి
Rammohan

Updated on: Jun 24, 2025 | 9:23 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో సుమారు 240కి పైగా ప్రయాణికులు, పలువురు మెడికల్‌ సిబ్బంది చనిపోయారు. ఈ దుర్ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. అయితే ఇప్పటి వరకు భారతదేశంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఆదే అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు.. విమానంలో బ్లాక్‌ బాక్స్‌ను తనిఖీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే సుమారు ప్రమాదం జరిగిన 27 గంటల తర్వాత ఘటనా స్థలం నుంచి బ్లాక్‌ బాక్స్‌ను సేకరించారు. ఈ బ్లాక్‌ బాక్స్‌లో ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు అసలు విమానంలో ఏం జరిగింది అనేది రికార్డ్‌ అయ్యి ఉంటుందని.. దాన్ని తెరిస్తే ప్రమాదానికి గల అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.

అయితే ఈ బ్లాక్‌బాక్స్‌ను ఒపెన్‌ చేసేందుకు అధికారులు ఇతర విదేశాలకు తరలిస్తున్నారని.. అక్కడే ఆ బాక్స్‌ను ఒపెన్‌ చేసి విచారణ జరపునున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రమాచారంపై తాజాగా కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. బ్లాక్‌ బాక్స్‌పై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు.

మంగళవారం పూణెలో జరిగిన హెలికాఫ్టర్స్‌ అండ్‌ స్మాల్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ సమ్మిట్‌ 2025 పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ..బ్లాక్‌బాక్స్‌పై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. బ్లాక్ బాక్స్‌ను విదేశాలకు తరలించలేదని.. బ్లాక్‌బాక్స్‌ ఇండియాలోనే ఉందని స్పష్టం చేశారు. బ్లాక్‌బాక్స్‌ ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆదీనంలో ఉందని.. దాన్ని ఓపెన్‌ చేసి పరిశీలించే పనిలో వారు ఉన్నట్టు ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..