ఆర్టికల్ 370 రద్దుపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రం సైనీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి, కేంద్రపాలిత ప్రాంతాలుగా బిల్లును పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిలను ఎలాంటి భయం లేకుండా పెళ్లాడవచ్చని వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన అవివాహితులు ఇక కశ్మీర్ వెళ్లి అక్కడ భూములు, ప్లాట్లు కొని, అక్కడి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చన్నారు. ప్రధాని మోదీ మనందరి కలను సాకారం చేశారని, అందుకే దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని సైనీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాల వల్లనే సాధ్యమైందని సైనీ అన్నారు. కాగా గతంలో కూడా సైనీ అనేకసార్లు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొరుగుదేశమైన పాకిస్థాన్ ను బాంబులతో పేల్చివేస్తానని ప్రకటించి వివాదాస్పదుడిగా నిలిచారు. దేశంలో నివాసానికి సురక్షితం కాదని భావించే జాతి వ్యతిరేకులు ఈ దేశంలో ఉండటానికి అర్హులు కాదని వ్యాఖ్యానించారు.
— Sanjay Jha (@JhaSanjay07) August 6, 2019