ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకిక దాదాపు వారం రోజులే ఉండగా.. బీజేపీ శుక్రవారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. నగర వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, నగర ఎన్నికల ఇన్-ఛార్జ్, కేంద్ర మంత్రి కూడా అయిన ప్రకాష్ జవదేకర్, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ఈ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్టీ ‘విజన్’ గురించి మనోజ్ తివారీ వివరించగా.. తమ పార్టీ ఆధ్వర్యంలోని మోదీ ప్రభుత్వం ఈ నగర అభివృద్దికి చేబట్టిన వివిధ ప్రాజెక్టులపై నితిన్ గడ్కరీ ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే.. ఆయుష్మాన్ భారత్ యోజనను అమలు చేస్తామని, హయ్యర్ సెకండరీ స్కూలు విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉచితంగా అందజేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. ఇంకా…. కేజీ రెండు రూపాయలకే గోధుమపిండి, ప్రతి ఇంటికీ శుధ్ధమైన నీటిని అందిస్తామని.. ఇలాగే పలు హామీలను కమలం పార్టీ ఇచ్చింది.