‘అంతర్జాతీయ పురుష దినోత్సవం కూడా జరపాల్సిందే’ బీజేపీ మహిళా ఎంపీ డిమాండ్

| Edited By: Anil kumar poka

Mar 08, 2021 | 4:05 PM

మార్చి  8 న ప్రపంచమంతా అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా..ఇలాగే అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని కూడా పాటించాలని బీజేపీ ఎంపీ సోనాల్ మాన్ సింగ్ కోరి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

అంతర్జాతీయ పురుష దినోత్సవం కూడా జరపాల్సిందే బీజేపీ మహిళా ఎంపీ డిమాండ్
Follow us on

మార్చి  8 న ప్రపంచమంతా అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా..ఇలాగే అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని కూడా పాటించాలని బీజేపీ ఎంపీ సోనాల్ మాన్ సింగ్ కోరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడిన ఆమె.. మనం స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా మెన్స్ డే ని కూడా ఎందుకు పాటించకూడదని అన్నారు. డ్యాన్సర్ కూడా అయిన ఈమె ఈ వ్యాఖ్యలు చేయగా ఇందుకు సభ్యులు పెద్దగా నవ్వారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 19 న అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పాజిటివ్ రోల్ మోడల్, పురుషుల బాగోగులపై చైతన్యాన్ని పెంచేందుకు ఉద్దేశించి ఐక్యరాజ్యసమితి ఈ మేరకు ఈ తేదీని నిర్దేశించింది. అయితే దీన్ని అబ్జెర్వెన్స్ లిస్టులో ఉంచింది. ఉత్తర అమెరికా, యూరప్  దేశాల్లో కార్మికోద్యమాల సందర్భంగా జరిగిన కార్యక్రమాల నేపథ్యంలో 1977 లో ఐరాస ప్రతి ఏటా మార్చ్ 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చింది.

ఈ సారి మహిళా దినోత్సవం థీమ్..’వుమెన్ ఇన్ లీడర్ షిప్, ఎచీవింగ్ యన్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ ఎ కోవిడ్-19 వరల్డ్’ అన్నదే.. ప్రపంచ వ్యాప్తంగా మొదట కోవిడ్ పాండమిక్, ఆతరువాత కోవిడ్ రీకవరీ, భవిష్యత్ ను ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో మహిళలు, విద్యార్థినులు  ప్రధాన పాత్ర వహించాలని యూఎన్ మహిళా విభాగం పేర్కొంది. కోవిడ్ పై పోరులో మహిళలు కూడా ముందుంటున్నారని, కానీ మగవారితో పోలిస్తే వారికి 11 శాతం తక్కువగా చెల్లింపులు జరుగుతున్నాయని ఈ విభాగం విమర్శించింది. పాండమిక్ సమయంలో స్త్రీలు, బాలికలు, యువతులపై నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయని, స్కూల్ డ్రాపవుట్స్ కూడా పెరిగిందని, ఐరాస మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూంజీలే నెగూకా అన్నారు. ఈ  ధోరణి తగ్గాలన్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా అనేక దేశాలు మహిళలపై ఘోరాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నా అవి సరిపోవడంలేదన్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

WhatsApp: వాట్సాప్ లో ఒక ఇంట్రెస్టింగ్ కొత్త ఫీచర్ రానుంది అది ఏంటిఅంటే…??

Google Search Fraud: కొంప ముంచిన గూగుల్ సెర్చ్.. క్షణాలలో రూ. 3లక్షలు పోయాయి ఎలాగంటే…??