పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో.. డానిష్‌ అలీపై రమేశ్‌ బిధూరి అనుచిత వ్యాఖ్యలు.. షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన బీజేపీ..

Parliament Special Session: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేశ్‌ బిధూరి ఓ వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ చేసిన వ్యాఖ్యలు కేంద్రానికి తలనొప్పిగా మారాయి. సమావేశాల చివరిరోజు బిధూరి మాట్లాడిన మాటలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. బీఎస్పీ ఎంపీ డానిష్‌ అలీపై రమేశ్‌ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్యకరమైన పదజాలంతో బిధూరి దూషించారు.

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో.. డానిష్‌ అలీపై రమేశ్‌ బిధూరి అనుచిత వ్యాఖ్యలు.. షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన బీజేపీ..
Ramesh Bidhuri Danish Ali

Updated on: Sep 23, 2023 | 10:31 AM

Parliament Special Session: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేశ్‌ బిధూరి ఓ వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ చేసిన వ్యాఖ్యలు కేంద్రానికి తలనొప్పిగా మారాయి. సమావేశాల చివరిరోజు బిధూరి మాట్లాడిన మాటలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. బీఎస్పీ ఎంపీ డానిష్‌ అలీపై రమేశ్‌ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్యకరమైన పదజాలంతో బిధూరి దూషించారు. విపక్షాలపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రమేశ్‌ బిధూరి తీరును సొంత పార్టీ నేతలే ఖండిస్తున్నారు. బీజేపీ హైకమాండ్‌ బిధూరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రమేశ్‌ బిధూరి వ్యాఖ్యలకు రికార్డుల నుంచి తొలగిస్తునట్టు ప్యానెల్‌ స్పీకర్‌ ప్రకటించినప్పటికి వివాదం సద్దుమణగలేదు. దీంతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వయంగా డానిష్‌ అలీకి క్షమాపణలు చెప్పారు.

కానీ, డానిష్‌ అలీతో పాటు విపక్షాలు వెంటనే రమేశ్‌ బిధూరి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. స్పీకర్‌ ఓంబిర్లాకు ఈ ఘటనపై డానిష్‌ అలీ లేఖ రాశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సైతం రమేశ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీలను,ముస్లింలను అవమానించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని కాంగ్రెస్‌ విమర్శించింది. డానిష్‌ అలీ నివాసానికి వచ్చిన రాహుల్‌గాంధీ ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ వ్యవహారంలో తమ మద్దతు డానిష్‌ అలీకి ఉంటుందన్నారు.

గతంలో లోక్‌సభ నుంచి విపక్ష నేత అధిర్‌రంజన్‌పై వెంటనే చర్యలు తీసుకున్న స్పీకర్‌ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు డానిష్‌ అలీ. ఇలాంటి మాటలతో భారత పార్లమెంట్‌ పరువు మంటకలుస్తుందన్నారు.

పార్లమెంటులో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పి) నాయకుడు డానిష్ అలీపై భారతీయ జనతా పార్టీ ఎంపి రమేష్ బిధూరి అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ శుక్రవారం ఖండించారు. అలాంటి ఆలోచనలను అందరూ బహిరంగంగా తిరస్కరించాలని అన్నారు. ఈ మేరకు థరూర్ ట్వీట్ చేశారు.

పార్లమెంట్‌ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రమేశ్‌ బిధూరిపై బీజేపీ హైకమాండ్‌ కఠినచర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం