హిమాచల్ ప్రదేశ్ కి చెందిన బీజేపీ ఎంపీ మండి రామ్ స్వరూప్ శర్మ ఢిల్లీలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి సమీపంలోని గోమతీ అపార్ట్ మెంట్ లో సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ ఈయన మృతదేహం కనబడింది. ఈయన సూసైడ్ కి కారణం తెలియలేదు. ఓ స్టాఫర్ నుంచి తమకు ఫోన్ కాల్ అందిందని, వెళ్లి చూస్తే డోర్ లోపలినుంచి వేసి ఉందని పోలీసులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి ప్రాంతానికి చెందిన ఈ ఎంపీ మృతిపట్ల హోం మంత్రి అమిత్ షా తన ట్విటర్ లో తీవ్ర సంతాపం ప్రకటించారు. రామ్ స్వరూప్ శర్మకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు. మండి జిల్లాలోని జల్ పెహర్ గ్రామంలో 1958 లో జన్మించిన ఈయన రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. 2014 లో, ఆ తరువాత 2019 లో ఈయన లోక్ సభకు ఎన్నికయ్యారు. విదేశీ వ్యవహారాలపై గల స్టాండింగ్ కమిటీలోను, ఈ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో కూడా శర్మ సభ్యుడిగా ఉన్నారు. ఈయన మృతికి సంతాప సూచనగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ సమావేశం ఈ ఉదయం జరగాల్సి ఉంది. శర్మ ఎందుకు సూసైడ్ చేసుకున్నారన్న విషయం స్పష్టం కాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని చదవండి ఇక్కడ : గ్రహంపై గంటల శబ్దం , మాటల గుసగుసలు..!ఆడియో విడుదల చేసిన నాసా.:The NASA delivered audio by lazers video.
శోభనానికి అంగీకరించని భార్య ఆరాతీస్తే విస్తుపోయే నిజాలు.. షాక్ అయిన భర్త..! : Wedding viral Video
సీఎం జగన్ కు… తాగుబోతుల విన్నపం ..!వైరల్ అవుతున్న లెటర్.: drunkards request CM Jagan Video