Anurag Thakur: ‘రాజ్యాంగాన్ని అవమానించింది రాహుల్ గాంధీ కుటుంబమే’.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..

|

Jul 21, 2024 | 7:03 PM

బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై ఎక్కువ ప్రేమ చూపిస్తోందని, రాహుల్ కూడా ప్రతిసారీ రాజ్యాంగ గ్రంధాన్ని చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారని ఎద్దేవాచేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేసింది రాహుల్ గాంధీ అని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చూపించి దానిపై తప్పుడు ప్రమాణాలు చేయడం వల్ల నిజం అబద్దంగా మారిపోదన్నారు.

Anurag Thakur: రాజ్యాంగాన్ని అవమానించింది రాహుల్ గాంధీ కుటుంబమే.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
Anurag Thakur
Follow us on

బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై ఎక్కువ ప్రేమ చూపిస్తోందని, రాహుల్ కూడా ప్రతిసారీ రాజ్యాంగ గ్రంధాన్ని చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారని ఎద్దేవాచేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేసింది రాహుల్ గాంధీ అని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చూపించి దానిపై తప్పుడు ప్రమాణాలు చేయడం వల్ల నిజం అబద్దంగా మారిపోదన్నారు. రాజ్యాంగాన్ని ఎవరైనా అవమానించాంటే.. అది కేవలం రాహుల్ గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీయే అని చురకలు అంటించారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న రాహుల గాంధీ ఎప్పుడైనా అందులోని పీఠికను చదివారా అని ప్రశ్నించారు.

అందులో అవినీతికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారన్నారు. ఆ పీఠిక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో పాటూ.. రాహుల్ గాంధీ చేసిన అవినీతిని స్పష్టంగా వివరిస్తుందని విమర్శించారు. కేవలం రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఊపుతూ తిరిగితే సరిపోదని కౌంటర్ వేశారు. వీటితో పాటూ గతంలో రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించిన తీరుకు సుప్రీం కోర్టు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా తప్పుబట్టిందని అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా రాజ్యాంగానికి విరుద్దమైన ఎమర్జెన్సీని తీసుకొచ్చారని గుర్తు చేశారు. చట్టాలకు విరుద్దంగా ఎన్నికలను రద్దు చేశారని పేర్కొన్నారు. ప్రజాపాలనను అర్ధాంతరంగా ఎలా రద్దు చేస్తారని గతంలో అనేక మంది ప్రశ్నించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..