AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అధ్యక్షపదవికి నితిన్‌ నబీన్‌ ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆయన ఎన్నిక లాంచనమే. నితిన్‌ నబీన్‌కు మద్దతుగా 37 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
Bjp National President
Anand T
|

Updated on: Jan 19, 2026 | 4:59 PM

Share

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్‌ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్‌లు దాఖలయ్యాయి. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్‌ నబీన్‌ పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీతో పాటు అమిత్‌షా , రాజ్‌నాథ్‌లు సంతకాలు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు నితిన్‌ నబీన్‌. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరవుతారు.

బీహార్ అసెంబ్లీకి 5 సార్లు ఎమ్మెల్యేగా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. బీజేపీ చరిత్రలో 45 ఏళ్ల వయస్సులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై.. నితిన్ నబీన్ రికార్డ్ సృష్టించబోతున్నారు. 2020 జనవరి 20 నుంచి జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవీకాలం రెండేళ్లు మాత్రమే. కానీ.. ఆరేళ్లుగా నడ్డా ఆ పదవిలో కొనసాగుతున్నారు. గడువు ముగిసే సమయంలో.. రెండుసార్లు నడ్డా పదవీకాలం పొడిగిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి నడ్డా పదవీకాలం ముగుస్తుండటంతో.. ఆయన స్థానంలో నితిన్ నబీన్‌ను అపాయింట్ చేయబోతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.