Maharashtra: ఫేస్ షీల్డ్ పెట్టుకుంటున్న మహారాష్ట్ర మంత్రి.. కారణం ఏమిటంటే..

|

Dec 18, 2022 | 12:30 PM

ఇటీవలే తనపై ఇంక్ దాడి జరిగిన నేపథ్యంలో బీజేపీ లీడర్, మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ ఫేస్ షీల్డ్ ధరించి బయటకు వస్తున్నారు. శనివారం పూణేలోని పింప్రీ చించ్వాడ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరైన సమయంలో ఫేస్ షీల్డ్ పెట్టుకుని..

Maharashtra: ఫేస్ షీల్డ్ పెట్టుకుంటున్న మహారాష్ట్ర మంత్రి.. కారణం ఏమిటంటే..
Maha Minister Chandrakanth Patil
Follow us on

ఇటీవలే తనపై ఇంక్ దాడి జరిగిన నేపథ్యంలో బీజేపీ లీడర్, మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ ఫేస్ షీల్డ్ ధరించి బయటకు వస్తున్నారు. శనివారం పూణేలోని పింప్రీ చించ్వాడ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరైన సమయంలో ఫేస్ షీల్డ్ పెట్టుకుని కనిపించారు. బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలేపై చంద్రకాంత్ పాటిల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా పింప్రీ నగరంలో ముగ్గురు వ్యక్తులు ఆయనపై సిరా విసిరారు. ఆ దాడి జరిగిన వారం తర్వాత ఆయన ఫేస్‌షీల్డ్ ధరించి కనిపించారు.  గత వారం ఆఫీస్ బేరర్ ఇంటి నుంచి పాటిల్ బయటకు వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆయనపై సిరా విసిరారు. ఈ మేరకు పాటిల్ సన్నిహితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా తన కళ్లను కాపాడుకునేందుకు వైద్యుల సూచన మేరకు మంత్రి ఫేస్ షీల్డ్‌ను ధరించారు. మరోవైపు చంద్రకాంత్ పాటిల్‌పై ఇంకుతో దాడి చేస్తామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాటిల్‌పై వారు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

అరెస్ట్ అయినవారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) కార్యకర్త వికాస్ లోలే, దశరథ్ పాటిల్‌ అని  పింప్రి చించ్‌వాడ్‌లోని సాంగ్వి పోలీసులు గుర్తించారు. ఇక వారిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153 (అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో ఇష్టపూర్వకంగా రెచ్చగొట్టడం), 505 (1) (బి) (వివాదాలకు దారితీసే ప్రకటనలు) కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇంకా పూణేలోని పవనతడి జాతరకు వచ్చిన సందర్భంగా పాటిల్‌పై సిరా వేస్తానని బెదిరించినందుకు వారిపై కేసు నమోదైంది.సోషల్ మీడియాలో పాటిల్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కొత్తూరు పోలీసులు ఒకరిపై కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం వ్యక్తిపై అభియోగాలు మోపినట్లు కోత్రుడ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి


కాగా, ఈ వారం ప్రారంభంలో చంద్రకాంత్ పాటిల్‌పై సిరా విసిరినందుకు అరెస్టయిన ముగ్గురు వ్యక్తులపై పూణెలోని పింప్రి చించ్వాడ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 10 మంది పోలీసుల సస్పెన్షన్‌ను కూడా పోలీస్ అధికారులు రద్దు చేశారు. ఇటీవల ఔరంగాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ ‘అంబేద్కర్, ఫూలే విద్యాసంస్థల నిర్వహణ కోసం ప్రభుత్వ గ్రాంట్‌లను కోరలేదని, వారు నిధులను సేకరించమని ప్రజలను భిక్షాటన చేశారన్నారు. ఈ క్రమంలో ఆయన ‘‘భిక్షాటన’’ పదాన్ని ఉపయోగించడం వివాదానికి దారితీసింది.