ప్రమాణ స్వీకారం ముగిసింది.. నెక్ట్స్ ఏంటి..!

| Edited By:

Jul 27, 2019 | 7:20 AM

అనేక ఊహాగానాల నడుల కర్ణాటక ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు బీఎస్ యడియూరప్ప. ఈ నేపథ్యంలో కర్ణాటక విధాన సభలో సోమవారం బలనిరూపణ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాజీనామా చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఈ విశ్వాసపరీక్షకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోతున్న బలపరీక్ష మీద ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అసంతృప్తి ఎమ్మెల్యేల్లో ముగ్గురిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఫలితంగా స్పీకర్ మినహాయించి సభలో ఎమ్మెల్యేల సంఖ్య 221కి పడిపోయింది. ఇక […]

ప్రమాణ స్వీకారం ముగిసింది.. నెక్ట్స్ ఏంటి..!
Follow us on

అనేక ఊహాగానాల నడుల కర్ణాటక ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు బీఎస్ యడియూరప్ప. ఈ నేపథ్యంలో కర్ణాటక విధాన సభలో సోమవారం బలనిరూపణ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాజీనామా చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఈ విశ్వాసపరీక్షకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోతున్న బలపరీక్ష మీద ఆసక్తి నెలకొంది.

ఎందుకంటే అసంతృప్తి ఎమ్మెల్యేల్లో ముగ్గురిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఫలితంగా స్పీకర్ మినహాయించి సభలో ఎమ్మెల్యేల సంఖ్య 221కి పడిపోయింది. ఇక మ్యాజిక్ ఫిగర్ 111కు చేరగా.. ప్రస్తుతం బీజేపీలో 105మంది సభ్యులున్నారు. ఒక స్వతంత్ర్య బీజేపీకి తన మద్దతును ప్రకటించినప్పటికీ.. మరో ఐదుగురు మద్దతిస్తేనే యడియూరప్ప విశ్వాసపరీక్షలో నెగ్గగలరు. ఇదిలా ఉంటే బీజేపీ సర్కార్‌కు మద్దతివ్వాలని కొందరు జేడీఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

కాగా రెబల్స్‌తో కలిపి కాంగ్రెస్ బలం 76, అసంతృప్తులతో కలిపి జేడీఎస్ బలం 37. వీరితో పాటు ఒక బీఎస్పీ సభ్యుడు, ఒక నామినేటెడ్ సభ్యుడు, నిర్ణయాత్మక ఓటు వేసే స్పీకర్ ఉన్నారు. మరోవైపు 14మంది సభ్యుల రాజీనామాలు, అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ వీరి రాజీనామాలు ఆమోదించినా లేక వారిపై అనర్హత వేటు వేసినా ఉపఎన్నికలు తప్పనిసరి. ఈ గందరగోళ సమయంలో ఎన్నికల్లో గెలవడం యడియూరప్పకు పెద్ద సవాలుగా మారనుంది.

ఒకవేళ విశ్వాసపరీక్షలో నెగ్గి ప్రభుత్వాన్ని కొనసాగించినా.. మంత్రి వర్గ కూర్పు కత్తిమీద సామేనని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్- జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలకు చోటు కల్పిస్తే సొంతపార్టీ వారితో చిక్కులు మొదలయ్యే అవకాశం ఉంది. ఇలా వరుస సమస్యలతో తన ముందున్న సవాళ్లను యడియూరప్ప ఎలా ఎదుర్కుంటారో చూడాలి.