టార్గెట్ 2024.. ఏపీ, తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చిన బీజేపీ అధిష్టానం.. ఈటెల, నల్లారికి కీలక పదవులు..

|

Jul 04, 2023 | 3:59 PM

Bharatiya Janata Party: కమలదళంలో సంస్థాగత మార్పులు జరగబోతున్నాయని ముందు నుంచి అనుకున్నట్లుగానే బీజేపీ అధిష్టానం చేసింది. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై వచ్చిన చర్చలు కూడా నిజమయ్యాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ అధ్యక్షులను సహా..

టార్గెట్ 2024.. ఏపీ, తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చిన బీజేపీ అధిష్టానం.. ఈటెల, నల్లారికి కీలక పదవులు..
BJP High Command
Follow us on

Bharatiya Janata Party: కమలదళంలో సంస్థాగత మార్పులు జరగబోతున్నాయని ముందు నుంచి అనుకున్నట్లుగానే బీజేపీ అధిష్టానం చేసింది. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై వచ్చిన చర్చలు కూడా నిజమయ్యాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ అధ్యక్షులను సహా దేశంలోని మరో 3 రాష్ట్రాల్లో కూడా ప్రెసిడెంట్ పదవిలో మార్పులు చేస్తూ మంగళవారం కమలదళ అధినేత జేపీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం తెలురురాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ సోము విర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరి.. తెలంగాణ బీజేపీకి బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇంకా జార్ఖండ్ బీజేపీ ఆధ్యక్షుడిగా బాబులాల్ మరాండి.. రాజస్థాన్‌లో గజేంద్రసింగ్ షెకావత్, పంజాబ్‌లో సునీల్ జాఖర్ కమలదళాన్ని నడిపించనున్నారు. ఇంకా ఈ మధ్యే ప్రధాని మోదీ బాటలో నడిచేందుకు బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం‌ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయకార్యవర్గంలో చోటు లభించింది. అలాగే హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కి తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి దక్కింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందుకోవడంతో.. ఆ పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా మరి కొన్ని నెలల్లోనే రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2024 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, అదే ఏడాది డిసెంబర్ నాటికి జార్ఖండ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముందు నుంచి ఆయా రాష్ట్రాల్లోని పార్టీ శ్రేణులను ఎన్నికల కోసం సంసిద్ధం చేయాలనే ఉద్దేశ్యంతో బీజేపీ అధిష్టానం ఈ విధమైన మార్పులు చేసిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..