Sonia Gandhi: కాంగ్రెస్(Congress) తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సెంట్రల్ ఢిల్లీలోని జనపథ్ రోడ్లో (Janpath Road bungalow) ఉన్న ప్రభుత్వ బంగ్లాకు దాదాపు ఏడాదిన్నరగా అద్దె చెల్లించలేదని భారతీయ జనతా పార్టీ (BJP) పేర్కొంది. రాయ్‌బరేలీ ఎంపీ సోనియా గాంధీ గత ఏడాది ఐదునెలల నుంచి అద్దె చెల్లించలేదని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా ఆర్టీఐ కాపీని ట్వీట్టర్ లో షేర్ చేశారు. మాల్వియా షేర్ చేసిన ఆ నోటిపికేషన్ ప్రకారం, 2020 సెప్టెంబర్‌లో జన్‌పథ్‌లోని 10వ నంబర్ బంగ్లాకు సోనియా చివరిసారిగా అద్దె చెల్లించారు. అలాగే, అక్బర్ రోడ్ (Congress’ Seva Dal office) 26కి గత 9 సంవత్సరాలుగా కాంగ్రెస్ అద్దె చెల్లించలేదు. చివరిగా డిసెంబర్ 2012లో అద్దె చెల్లించినట్లు తెలుస్తోంది.
‘లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల ప్రయాణనికి సంబంధించిన విధానం’పై సోనియాపై విమర్శలు చేస్తూ.. మాల్వియా RTI నోటీస్ ను బహిర్గతం చేశారు. “వలస కార్మికుల టిక్కెట్ల కోసం సోనియా గాంధీ పెద్ద ఒప్పందం చేసుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు సోనియా ఏడాదిన్నరగా తన సొంత ఇంటి అద్దె చెల్లించలేదని తేలింది!” అంటూ ట్వీట్ చేశారు.
మహమ్మారి మొదటి వేవ్ సమయంలో ఈ ఓల్డ్ పార్టీ పాపం చేసి గందరగోళ వాతావరణాన్ని సృష్టించింది’ అని లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగడం గమనార్హం. “కరోనా వైరస్ మొదటి వేవ్ సమయంలో, కాంగ్రెస్ పరిమితిని దాటింది” అని ప్రధాని మోడీ ఆరోపించారు. లాక్డౌన్ ప్రకటన చేసిన సమయంలో కేంద్ర ప్రభుత్వం, WHO ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండండి అంటూ సలహా ఇస్తే.. ముంబై రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ వెళ్లి కరోనావైరస్ వ్యాప్తి చేయడానికి కార్మికులకు టిక్కెట్లు ఇచ్చారని ఆరోపించిన సంగతి తెలిసిందే.
Sonia Gandhi made a big deal about paying for tickets of migrant workers.
Turns out she has not paid her own house rent for one and a half year! pic.twitter.com/w5iKoTy7TH
— Amit Malviya (@amitmalviya) February 10, 2022
Also Read: