Singer KK: సింగర్ ‘కేకే’ మృతిపై రాజకీయ రగడ.. ఆ కారణంగానే చనిపోయాడంటూ షాకింగ్ ఆరోపణలు..!

|

Jun 02, 2022 | 8:19 AM

Singer KK: సింగర్‌ కేకే మృతి రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమత సర్కార్‌ వైఫల్యం వల్లే కేకే మరణించారంటూ..

Singer KK: సింగర్ ‘కేకే’ మృతిపై రాజకీయ రగడ.. ఆ కారణంగానే చనిపోయాడంటూ షాకింగ్ ఆరోపణలు..!
Singer Kk
Follow us on

Singer KK: సింగర్‌ కేకే మృతి రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమత సర్కార్‌ వైఫల్యం వల్లే కేకే మరణించారంటూ విరుచుకుపడుతోంది బీజేపీ. మ్యూజిక్‌ కన్సర్ట్‌కు సరైన ఏర్పాట్లు చేయలేదని.. ఒక సెలబ్రిటీకి కల్పించాల్సిన సెక్యూరిటీ కల్పించలేదని మండిపడ్డారు కమలనాథులు. 3వేల మంది వరకు మాత్రమే హాల్‌ కెపాసిటీ ఉంటే, రెట్టింపు సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని ఆరోపిస్తున్నారు. గుంపులు గుంపులుగా వచ్చిన ఫ్యాన్స్‌ తోసుకుంటూ ఆడిటోరియం లోపలికి ప్రవేశించారని, దీంతో తలుపులు విరిగిపోయాయని, బారికేడ్లు ధ్వంసమయ్యాయంటూ వాటికి సంబంధించిన ఫొటోలను రిలీజ్‌ చేశారు బీజేపీ నేతలు. మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్‌ ప్రభుత్వం పాలనపై నియంత్రణ కోల్పోయిందని, ప్రముఖులకు తగిన రక్షణ కల్పించడంలో విఫలమవుతోందని విరుచుకుపడ్డారు బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌. ఇక కేకే మృతిపై నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది కాంగ్రెస్‌.

మరోవైపు బీజేపీపై కౌంటర్‌ అటాక్‌ చేశారు టీఎంసీ నాయకులు. కేకే మరణం నిజంగా దురదృష్టకరం..బాధాకరం అంటూనే బీజేపీ నేతల ఆరోపణలపై మండిపడ్డారు. ఈ విషాదకర ఘటనను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ నేతలు. కేకే మృతి ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. సీఎం మమతా బెనర్జీ.. కేకే భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆ రాష్ట్ర భద్రతా సిబ్బంది కేకేకు నివాళిగా గన్‌ సెల్యూట్‌ చేశారు. మరోవైపు కేకే తల, ముఖంపై గాయాలుండటంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేకేది అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. కేకే మృతికి నిర్లక్ష్యమే కారణమా.. క్రౌడ్‌ను కంట్రోల్‌ చేసేందుకు యూజ్‌ చేసిన పొగే ఆయన ప్రాణం తీసిందా.. అసలేం జరిగింది.. కేకే మరణానికి కారణమేంటి.. అన్నది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తేనే క్లారిటీ రానుంది.