ఒడిశాలో ఓ టీవీ ఛానల్ పై బీజేడీ మహిళా ఎంపీ ఫిర్యాదు

ఒడిశాలో బిజూ జనతా దళ్ (బీజేడీ) కి చెందిన చంద్రాణి ముర్ము అనే మహిళా ఎంపీ ఓ టీవీ ఛానల్ పై ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఆ ఛానల్ తన వీడియోలను మార్ఫ్ చేస్తూ,అసభ్యంగా చూపుతూ సర్క్యులేట్ చేస్తోందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె లేఖ రాసింది. సదరు ఛానెల్ పై  కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కియోంజహార్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈమె.. […]

ఒడిశాలో ఓ టీవీ ఛానల్ పై బీజేడీ  మహిళా ఎంపీ ఫిర్యాదు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 19, 2020 | 6:09 PM

ఒడిశాలో బిజూ జనతా దళ్ (బీజేడీ) కి చెందిన చంద్రాణి ముర్ము అనే మహిళా ఎంపీ ఓ టీవీ ఛానల్ పై ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఆ ఛానల్ తన వీడియోలను మార్ఫ్ చేస్తూ,అసభ్యంగా చూపుతూ సర్క్యులేట్ చేస్తోందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె లేఖ రాసింది. సదరు ఛానెల్ పై  కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కియోంజహార్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈమె.. ఈ ఛానల్ తన ప్రతిష్టను దెబ్బ తీస్తోందని, ఈ నెల 15 నుంచి పలు ఫేక్ కార్యక్రమాలను ప్రసారం చేస్తోందని కూడా దుయ్యబట్టింది. ఈమె ఆరోపణల నేపథ్యంలో రమేష్ రథ్ అనే రిపోర్టర్ ను పోలీసులు అరెస్టు చేసారు.

ఈ ఛానల్ ని బిజూ జనతాదళ్ మాజీ వ్యవస్థాపక సభ్యుడు వైజయంత్ జే  పాండా గతంలో నిర్వహించగా ప్రస్తుతం ఆయన భార్య దీని అజమాయిషీ చూస్తున్నారు.  అయితే ఇప్పుడు వైజయంత్ జే పాండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు.