చెత్త దుకాణమే టార్గెట్‌గా 20 సార్లు చోరీ.. దొంగ ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

సాధారణంగా ఇంట్లో పనికిరాని వస్తువులను స్క్రాప్‌ దుకాణాలకు అమ్మేస్తుంటాం. కానీ ఇక్కడో యువకుడు ఆ పనికిరాని వస్తువులు ఉండే షాప్‌నే టార్గెట్‌ చేసుకొని.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 సార్లు దొంగతనానికి పాల్పడ్డాడు. ఇలా దొంగలించిన వస్తువుల నుంచి ఏకంగా రూ.9లక్షల వరకు సంపాధించాడు. షాపు నిర్వాహకుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంతకూ అతని ఏం దొంగతనం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

చెత్త దుకాణమే టార్గెట్‌గా 20 సార్లు చోరీ.. దొంగ ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Scrap Shop Copper Theft

Updated on: Oct 06, 2026 | 1:00 PM

ఒకే దుకాణాన్ని టార్గెట్ చేసుకొని ఓ యువకుడు ఏకంగా 20 సార్లకు పైగా దొంగతానికి పాల్పడిన వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్‌లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. చిక్కబళ్లాపూర్‌లోని సిండికేట్ స్క్రాప్ దుకాణం యజమాని ముషీర్ అహ్మద్ షాపులో గత కొన్ని నెలలుగా రాగితో పాటు ఇతర విలువైన స్క్రాప్ వస్తువులు పదేపదే మాయమవుతుండేవి. గౌరీబిదనూర్, షిడ్లఘట్ట ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా తొలగించిన పాత భవనాల ఎలక్ట్రికల్ వైరింగ్ సామగ్రిని కొనుగోలు చేసిన ముషీర్, అందులోని రాగిని వేరు చేసి దుకాణంలో ప్రత్యేకంగా నిల్వ ఉంచారు. ఆ విలువైన రాగి తరచూ కనిపించకుండా పోతుండటంతో యజమానికి తీవ్ర అనుమానం వచ్చింది.

దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, అర్ధరాత్రి వేళల్లో ఓ యువకుడు దుకాణంలోకి చొరబడి రాగిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో యజమాని, సిబ్బంది స్వయంగా కాపలా కాసి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, భారీ వర్షం కురవడంతో ఆ దొంగ తప్పించుకున్నాడు. దీంతో వరుస చోరీలపై యజమాని ముషీర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచనల మేరకు దుకాణం వద్ద పక్కాగా కాపలా కాయగా, మళ్లీ రాగి దొంగిలించేందుకు వచ్చిన సలీం అనే యువకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుటున్నారు.

దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా, అతడు డ్రగ్స్‌కు బానిసై ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. దొంగిలించిన రాగిని బెంగళూరు గ్రామీణ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయించేవాడని పోలీసులు వెల్లడించారు. ఈ దొంగతనాల్లో సలీంకు సహకరించిన మరో ఇద్దరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us