Bird flu in Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న బర్ద్ ఫ్లూ, మరో రెండు జిల్లాలో నిర్ధారణ.. 2000 కోళ్లు కల్లింగ్

|

Jan 16, 2021 | 3:18 PM

మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కేసులు విజృంభిస్తున్నాయి. శుక్రవారం వరకూ తొమ్మిది జిల్లాల్లో ఉన్న ఈ వైరస్ తాజాగా మరో రెండు జిల్లాలకు వ్యాపించింది. ఇప్పటికే లాతూర్, నాందేడ్, నాసిక్,...

Bird flu in Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న బర్ద్ ఫ్లూ, మరో రెండు జిల్లాలో నిర్ధారణ.. 2000 కోళ్లు కల్లింగ్
Follow us on

Bird flu in Maharashtra: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కేసులు విజృంభిస్తున్నాయి. శుక్రవారం వరకూ తొమ్మిది జిల్లాల్లో ఉన్న ఈ వైరస్ తాజాగా మరో రెండు జిల్లాలకు వ్యాపించింది. ఇప్పటికే లాతూర్, నాందేడ్, నాసిక్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాగా తాజాగా మరాఠ్వాడ ప్రాంతంలోని పర్భాని, బీడ్ జిల్లాల్లోని రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యిందని కలెక్టర్ చెప్పారు. చనిపోయిన కోళ్ళ శాంపిల్స్ ను పరీక్ష నిమితం పంపించగా పాజిటివ్ గా వచ్చిందని.. దీంతో శనివారం 2 వేలకు పైగా కోళ్లను కల్లింగ్ చేపట్టామని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాలను నిషేధిత ప్రాంతంగా ప్రకటించిన అధికారులు కల్లింగ్ ప్రక్రియను చేపట్టారు. అంతేకాదు ఆ ప్రాంతంలో పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణా నిలిపివేశామని కలెక్టర్ దీపక్ ముగ్లికర్ చెప్పారు.

Also Read: ఐదేళ్లుగా సహజీవనం, పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని చంపి.. గోడలో..