ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్లు.. భయాందోళనలో ప్రయాణికులు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి

మంగళవారం బిలాస్‌పూర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 10 మందికిపైగా ప్రయాణికులు మరణించిన ఘటన మరువక ముందే అదే జిల్లాలో మరో పెను ప్రమాదం తప్పింది. బిలాస్‌ పూర్‌ మీపంలోని కోట్మి సోనార్, జైరాంనగర్ స్టేషన్ల మధ్య ఉన్న ట్రాక్‌పై ఒకే సారి మూడు ట్రైన్స్‌ వచ్చాయి.దీంతో భయపడిపోయిన జనాలు ట్రైన్‌లోంచి దిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్లు.. భయాందోళనలో ప్రయాణికులు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
Bilaspur Train Near Miss

Updated on: Nov 06, 2025 | 4:56 PM

ఒకే ట్రాక్‌పై మూడు ట్రైన్‌లు కనిపించిన ఘటన ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో వెలుగు చూసింది. కోట్మి సోనార్, జైరాంనగర్ స్టేషన్ల మధ్య ఉన్న ట్రాక్‌పై ఒకే సారి రెండు గూడ్స్‌ రైళ్లు, ఒక ప్యాసింజర్ రైలు వచ్చాయి. అది గమనించిన ప్రయాణికులు లోకోపైలట్‌ వెంటనే ట్రైన్‌ ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఇదంతా ఒక ప్యాసింజర్ రైలు కదులుతున్నప్పుడు జరిగింది. ట్రాక్‌పై ప్యాసింజర్ ట్రైన్ ఉండగా అకస్మాత్తుగా ముందు నుంచి ఒకటి, వెనక నుంచి ఒక గూడ్స్‌ రైలు ట్రాక్‌పైకి వచ్చింది. దీంతో ప్యాసింజర్ ట్రైన్ రెండు గూడ్స్‌ ట్రైన్స్‌ మధ్యలో చిక్కుకు పోయింది.

ఇది గమనించిన ప్యాసింజర్‌ ట్రైన్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.తరువాత ఏమి జరుగుతుందోనని అందరు ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొందరు కేకలు వేయడం ప్రారంభించారు, మరికొందరు ప్రార్థనలు చేశారు. చాలామంది భయంతో పట్టాలపైకి దూకారు. కానీ లోకోపైలట్ మాత్రం ఎలాంటి పొరపాటు చేయకుండా చాకచక్యంగా వ్యవహరించి ట్రైన్‌ ఆపేశాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక వేళ రెండు గూడ్స్‌ రైళ్లు మధ్యనున్న ప్యాసింజర్ ట్రైన్‌ను ఢీకొని ఉంటే ఊహించలేని ప్రాణనష్టం జరిగేది.

మూడు ట్రైన్స్‌ ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయి?

ఇవి కూడా చదవండి

మూడు ట్రైన్స్‌ ఒకే ట్రాక్‌పైకి రావడం అనేది చాలా అరుదు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ కారణంగా మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పై ప్రయాణిస్తున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది. ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఒకే మార్గంలో బహుళ రైళ్లను నడపడానికి అనుమతిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.