Viral Video: రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నారా..? కారులో వెళ్తున్న దంపతులకు ఏమైందో తెలుసా..? ఈ షాకింగ్ వీడియో చూడండి

|

Jan 30, 2023 | 9:35 AM

డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ జంటకు జరిగినది మీకు జరగకుండా జాగ్రత్త వహించండి. రాత్రి ప్రయాణంలో కారు డోర్ తెరవకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు పౌరులు తప్పనిసరిగా డ్యాష్‌బోర్డ్ కెమెరాను ఉపయోగించాలని కోరుతున్నారు పోలీసులు.

Viral Video: రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నారా..? కారులో వెళ్తున్న దంపతులకు ఏమైందో తెలుసా..? ఈ షాకింగ్ వీడియో చూడండి
Bikers Hits Car
Follow us on

ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక షాకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రయాణంలో ఏదైనా భయంకరమైన సంఘటన జరిగినప్పుడు ఒళ్లు గగ్గొర్పాటుకు గురికాక తప్పదు. అదేవిధంగా రాత్రిపూట ప్రయాణంలో ఏదైనా ఘోరం జరిగితే సకాలంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఎందుకంటే బెంగళూరు రోడ్డుపై తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ జంట తమ కారులో ప్రయాణిస్తోంది. ఇంతలో బైకర్లు వారి కారును ఢీకొట్టారు. ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు దంపతులను 5 కిలోమీటర్ల మేర వెంబడించారు. ఈ దారుణ ఘటన అంతా ఆయన కారులోని డ్యాష్‌బోర్డ్ కెమెరాలో నిక్షిప్తమై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాత్రి ప్రయాణంలో దంపతులకు అసలు ఏం జరిగింది?
వైరల్ వీడియోలో, ఇద్దరు యువకులు రోడ్డుకు వ్యతిరేక దిశలో ద్విచక్రవాహనం నడుపుతూ కారును ఢీకొట్టడం కనిపిస్తుంది. కారును ఢీకొట్టిన తర్వాత టూవీలర్‌ పై వచ్చిన యువకుడు దంపతులను బెదిరించేందుకు ప్రయత్నించిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే సమయానికి అప్రమత్తమైన వారు.. కారును వెనక్కి తీసుకున్నాడు. అయితే యువకుడు కారును వెంబడించి కిటికీ తెరవడానికి ప్రయత్నించాడు. ఈ యువకులు దాదాపు 5 కిలోమీటర్ల మేర కారును వెంబడించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ట్విట్టర్‌లో వైరల్ కావడంతో కలకలం రేగింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ట్విట్టర్ హ్యాండిల్ @east_bengaluruలో వైరల్ అయిన తర్వాత, బెంగళూరు పోలీసులు స్పందించారు. వీడియో గమనించిన పోలీసులు.. వెంటనే షాకింగ్‌ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం ద్వారా పౌరులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ జంటకు జరిగినది మీకు జరగకుండా జాగ్రత్త వహించండి. రాత్రి ప్రయాణంలో కారు డోర్ తెరవకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు పౌరులు తప్పనిసరిగా డ్యాష్‌బోర్డ్ కెమెరాను ఉపయోగించాలని కోరుతున్నారు పోలీసులు, ఉన్నతాధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..