Maoist Attack: చత్తీస్‌గఢ్‌లో దారుణం.. ముగ్గురిని హత్య చేసిన మావోయిస్టులు..మరో 12 మందిని..

రాత్రి 8:30 గంటల వరకు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించలేదని తెలిసింది. కానీ, గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అపహరణకు గురైన గ్రామస్తుల ప్రాణాలకు ఏమౌతుందోననే భయంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రాత్రి సమయం కావటంతో పోలీసు బృందాలు మారుమూల గ్రామానికి వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే ఆకస్మిక దాడి లేదా IED దాడి జరిగే అవకాశం ఉంది.

Maoist Attack: చత్తీస్‌గఢ్‌లో దారుణం.. ముగ్గురిని హత్య చేసిన మావోయిస్టులు..మరో 12 మందిని..
maoists

Updated on: Jun 17, 2025 | 9:23 PM

చత్తీస్‌గఢ్‌‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పెద్దకోర్మ గ్రామంలో లొంగిపోయిన మావోయిస్టు సభ్యుడు దినేశ్‌ మొడియం కుటుంబానికి చెందిన ముగ్గురిని మావోయిస్టులు మంగళవారం సాయంత్రం దారుణంగా హత్య చేశారు. మృతులు జింగు మొడియం, సోమ మోడియం, అనిల్ మద్వి అని తెలుస్తోంది. అనంతరం మావోయిస్టులు గ్రామంలోని ఏడుగురిపై దాడి చేశారు. మరో 12 మందిని కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు ఎఎస్పీ తెలిపారు.

స్థానిక ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేయడం,లొంగిపోయిన మావోయిస్టులతో సంబంధం ఉన్నవారిని శిక్షించడం ఈ దాడి లక్ష్యంగా మావోయిస్టులు భావిస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. బీజాపూర్‌ దీనేష్‌ అత్యంత భయంకరమైన మావోయిస్టుగా పోలీసులు చెబుతున్నారు. అమాయక ప్రజల హత్యకు మావోయిస్టు కమాండర్‌ వెల్ల, అతని బృందం నాయకత్వం వహించినట్లుగా సమాచారం.

హత్యలతో పాటు, మరో ఏడుగురు గ్రామస్తులపై దాడి చేసి గాయపరిచారు. మరో 12 మంది స్థానికులను కిడ్నాప్‌ చేశారు. వీరి జాడ ఇంకా తెలియలేదు. రాత్రి 8:30 గంటల వరకు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించలేదని తెలిసింది. కానీ, గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అపహరణకు గురైన గ్రామస్తుల ప్రాణాలకు ఏమౌతుందోననే భయంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రాత్రి సమయం కావటంతో పోలీసు బృందాలు మారుమూల గ్రామానికి వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే ఆకస్మిక దాడి లేదా IED దాడి జరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..